twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంజు కలెక్షన్ల దండయాత్ర.. రికార్డులు బ్రేక్.. బాహుబలికి తప్పని షాక్!

    By Rajababu
    |

    Recommended Video

    Sanju Movie Collections Crossed Bahubali Record

    బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రూపొందిన సంజు చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. గత పదిరోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం రూ.250 కోట్ల మార్కును దాటి రూ.300 కోట్ల క్లబ్‌ వైపు దూసుకెళ్తున్నది. 2018 ఏడాదిలో సంజు చిత్రం పలు రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పింది.

    బాక్సాఫీస్ వద్ద బలంగా రెండోవారం

    బాక్సాఫీస్ వద్ద బలంగా రెండోవారం

    సంజు విడుదల తర్వాత రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు బలంగా ఉన్నాయి. రెండో శుక్రవారం 12.5 కోట్లు వసూలు చేయగా, శనివారం రూ. 21.25 కొల్లగొట్టింది. అలాగే ఆదివారం రూ.28 కోట్లు వసూలు చేసి రెండో వారాంతంలో 61.75 కోట్లు కలెక్ట్ చేసింది.

     బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డు బ్రేక్

    బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డు బ్రేక్

    సంజు విడుదలైన తొలి వారాంతంలో ఆదివారం రూ.46.71 కోట్లు వసూలు చేసింది. ఓ ఆదివారం ఈ రేంజ్‌లో వసూళ్లు రాబట్టడం బాలీవుడ్‌లోనే రికార్డు పేర్కొన్నారు. బాహుబలి2 చిత్రం 46.50 కోట్లు వసూలు చేసి అప్పట్లో ఓ రికార్డును సొంతం చేసుకొన్నది.

    2018లో సరికొత్త రికార్డులు

    2018లో సరికొత్త రికార్డులు

    సంజు చిత్రం రిలీజ్ రోజున రూ.34.75 కోట్లతో 2018లో మొదటి రోజున అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఘనతను సాధించింది. అలాగే 2018లో వారాంతానికే రూ.119.33 కోట్లు వసూలు చేసి సినిమాగా ఓ రికార్డును సొంతం చేసుకొన్నది.

    రణ్‌బీర్ కపూర్ కెరీర్‌లోనే అత్యధికంగా

    రణ్‌బీర్ కపూర్ కెరీర్‌లోనే అత్యధికంగా

    సంజు వసూళ్లు హీరో రణ్‌బీర్ కపూర్, నిర్మాత, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. రణ్‌బీర్ కెరీర్‌లోనే అత్యధిక, వారాంతంలో ఎక్కువ వసూళ్లు చేసిన చిత్రంగా సంజు నిలిచింది. అలాగే రాజ్ కుమార్ హిరాని కెరీర్‌లో కూడా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మరో రికార్డును సొంతం చేసుకొన్నది.

    క్రిటిక్స్ మిక్స్‌డ్ రెస్పాన్స్

    క్రిటిక్స్ మిక్స్‌డ్ రెస్పాన్స్

    సంజు బయోపిక్‌లో సోనమ్ కపూర్, మనీషా కోయిరాలా, పరేశ్ రావెల్, జిమ్ సర్బ్, వికాశ్ తదితరులు నటించారు. ఈ చిత్రం జూన్ 29న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై సినీ విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది.

    English summary
    Rajkumar Hirani’s Sanju has now crossed Rs 250 crore-mark at the box office within 10 days of the release. According to a boxofficeindia report, the Ranbir Kapoor-starrer has earned Rs 261.83 crore and is expected to Rs 300-crore club. The Ranbir Kapoor film is still going strong at the box office and has brojen as many records as it has created.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X