Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సంజు కలెక్షన్ల దండయాత్ర.. రికార్డులు బ్రేక్.. బాహుబలికి తప్పని షాక్!
Recommended Video
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రూపొందిన సంజు చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. గత పదిరోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం రూ.250 కోట్ల మార్కును దాటి రూ.300 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తున్నది. 2018 ఏడాదిలో సంజు చిత్రం పలు రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
బాక్సాఫీస్ వద్ద బలంగా రెండోవారం
సంజు విడుదల తర్వాత రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు బలంగా ఉన్నాయి. రెండో శుక్రవారం 12.5 కోట్లు వసూలు చేయగా, శనివారం రూ. 21.25 కొల్లగొట్టింది. అలాగే ఆదివారం రూ.28 కోట్లు వసూలు చేసి రెండో వారాంతంలో 61.75 కోట్లు కలెక్ట్ చేసింది.
బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డు బ్రేక్
సంజు విడుదలైన తొలి వారాంతంలో ఆదివారం రూ.46.71 కోట్లు వసూలు చేసింది. ఓ ఆదివారం ఈ రేంజ్లో వసూళ్లు రాబట్టడం బాలీవుడ్లోనే రికార్డు పేర్కొన్నారు. బాహుబలి2 చిత్రం 46.50 కోట్లు వసూలు చేసి అప్పట్లో ఓ రికార్డును సొంతం చేసుకొన్నది.
2018లో సరికొత్త రికార్డులు
సంజు చిత్రం రిలీజ్ రోజున రూ.34.75 కోట్లతో 2018లో మొదటి రోజున అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఘనతను సాధించింది. అలాగే 2018లో వారాంతానికే రూ.119.33 కోట్లు వసూలు చేసి సినిమాగా ఓ రికార్డును సొంతం చేసుకొన్నది.
రణ్‌బీర్ కపూర్ కెరీర్లోనే అత్యధికంగా
సంజు వసూళ్లు హీరో రణ్‌బీర్ కపూర్, నిర్మాత, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. రణ్‌బీర్ కెరీర్లోనే అత్యధిక, వారాంతంలో ఎక్కువ వసూళ్లు చేసిన చిత్రంగా సంజు నిలిచింది. అలాగే రాజ్ కుమార్ హిరాని కెరీర్లో కూడా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మరో రికార్డును సొంతం చేసుకొన్నది.
క్రిటిక్స్ మిక్స్డ్ రెస్పాన్స్
సంజు బయోపిక్‌లో సోనమ్ కపూర్, మనీషా కోయిరాలా, పరేశ్ రావెల్, జిమ్ సర్బ్, వికాశ్ తదితరులు నటించారు. ఈ చిత్రం జూన్ 29న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై సినీ విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది.