twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2011 సంక్రాంతి చిత్రాల కలెక్షన్స్ పరిస్ధితి(ట్రేడ్ టాక్)

    By Srikanya
    |

    సంక్రాంతి అనేది తెలుగు చిత్ర పరిశ్రమకి డబ్బులు తెచ్చిపెట్టే పండుగ. ఫిల్మ్ మెకర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఈ పండుగ కోసం ఎదురుచూస్తూంటారు. అయితే 2011 సంక్రాంతి మాత్రం వారి ఎదురుచూపులకు అర్దం లేకుండా చేసింది. మొదటి వారం సంక్రాంతికి విడుదలైన మూడు చిత్రాల కలెక్షన్స్ కలిపితే పదికోట్లు కూడా దాటకపోవటం అందరినీ షాక్ కు గురి చేసింది. పరిశ్రమ పెద్దల లెక్కల ప్రకారం చివర మూడు సంవత్సరాల లెక్కలు చూస్తే యాభై శాతంఈ సంవత్సరం సంక్రాంతి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. 2010లో ఇరవై ఒక్క కోట్లు వసూలు చేస్తే, 2009లో పంతొమ్మిది కోట్లు వచ్చింది. ఈ సంవత్సరమే మరీ పది కోట్లు కు పడిపోయింది.

    పెరుగుతున్న మార్కెట్, టిక్కెట్ ధరలు, బడ్జెట్ ని బట్టి ఈ అంకె బాగా పెరగాల్సింది.కానీ అలా జరగలేదు. దీనికి రకరకాల కారణాలు చెప్తున్నారు. అరుంధతి చిత్రం మొదటి వారంలో 11కోట్లు సింగిల్ గా వసూలు చేస్తే, లాస్ట్ ఇయిర్ రిలీజ్ అదుర్స్ చిత్రం మొదటి వారం పదమూడుకోట్లు వసూలు చేసింది. ఇక ఈ విషయమైఫిలిం ఛాంబర్ ఆఫ్ కామెర్స్ ప్రెసెడెంట్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ...టీవిలో రోబో చిత్రం వేస్తూంటే ధియోటర్ కి వెళ్ళి సినిమా చూడ్డానికి ఎవరూ ఇష్టపడలేదు అన్నారు.

    కాళిదాసు, కరెంట్ చిత్రాల నిర్మాత చింతలపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ...కరువు, వరదలు వంటి ప్రకృతి భీభత్సాలు వల్ల రైతులు పండుగ అయిన సంక్రాంతికి ఎవరూ సరిగ్గా జరుపుకోలోకపోయారు. అదే సినిమాల కలెక్షన్స్ పై పడిందని వ్యాఖ్యానించారు. అలాగే శ్రీనివాస్ అనే డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుతూ...ఎస్.ఎమ్.ఎస్ ల వల్ల సినిమా రిపోర్టు త్వరగా ప్రజల్లోకి వెళ్ళిపోతోంది. అదే డ్యామేజ్ చేస్తోంది అని వ్యాఖ్యానించారు. అయితే నిజంఏమిటంటే సినిమాలు బాగుంటే జనం ఎగబడి చూస్తారు. అది ప్రతీసారి రుజువు అవతూనే ఉంది.కాదంటారా.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X