Sankranti 2022: సంక్రాంతి రేసులో ఉన్న ఈ బ్యూటిల రెమ్యునరేషన్ ఎంతంటే.. రెచ్చిపోయి నటించడంతో..

సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో సక్సెస్ రేటు పెరుగుతున్న ఒక్కరోజులోనే హీరోయిన్ రేంజ్ కూడా అమాంతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఫార్ములాను చాలా పర్ఫెక్ట్ గా యూస్ చేసుకుంటున్నారు. సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగిన ముగ్గురు ప్రముఖ హీరోయిన్స్ వారి పారితోషికాలతోనే ఇండస్ట్రీలో అందరికీ షాక్ ఇచ్చారు అనే చెప్పాలి. అనుపమ పరమేశ్వరన్, నిధి అగర్వాల్ ఈ ముగ్గురు కూడా భారీ స్థాయిలో పారితోషకం అందుకునే సినిమాలను చేశారు.

అనుపమ హాట్ లిప్ లాక్

అనుపమ హాట్ లిప్ లాక్

అనుపమ పరమేశ్వరన్ తన సినీ జీవితంలో ఇప్పటివరకు రొమాంటిక్ డోస్ ఎక్కువగా ఉన్న సినిమాలను అయితే చేయలేదు. వీలైనంత వరకు ఆమె గ్లామర్ డోస్ కు చాలా దూరంగా ఉంటూ వచ్చింది. కానీ మొదటిసారి బడా నిర్మాత దిల్ రాజు ఇంటి నుంచి వచ్చిన ఆశిష్ రెడ్డి రౌడి బాయ్స్ సినిమాలో ఘాటైన లిప్ లాక్ తో అందరికీ షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.

రౌడి బాయ్స్ సినిమా కోసం..

రౌడి బాయ్స్ సినిమా కోసం..

అనుపమ పరమేశ్వరన్ మొదటి సారి హాట్ నెస్ డోస్ పెంచింది అంటే అది ఒక ఆశ్చర్యకరమైన విషయమే అని చెప్పాలి. అంతేకాకుండా ఆ సినిమాలో ఆమె నటించిన కొన్ని సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. దీంతో రౌడి బాయ్స్ సినిమాకు ఆమె భారీ స్థాయిలో పారితోషికం అందుకొంది అనే విషయం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అనుపమ పరమేశ్వరన్ రౌడి బాయ్స్ సినిమాకు 1.75 కోట్ల వరకు పారితోషికం అందినట్లు తెలుస్తోంది.

అందాల నిధికి ఎంతంటే?

అందాల నిధికి ఎంతంటే?

మరో గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా 'హీరో' సినిమాలో అయితే గ్లామర్ డోసు మరింతగా దాటేసింది. అశోక్ గల్లా మొదటి సినిమా కావడంతో ఆ సినిమాలో కమర్షియల్ అంశాలను చాలా ఎక్కువగానే జతచేశారు. ఇక ధీంతో నిధి అగర్వాల్ లిప్ లాక్ సీన్లో ఘాటుగా నటించినట్లు తెలుస్తుంది. అంతకు ముందు వరకు కూడా కోటి కంటే తక్కువగానే డిమాండ్ చేసిన ఈ బ్యూటీ హీరో సినిమాకు మాత్రం కోటి వరకు పారితోషికం అందుకున్నట్లు సమాచారం.

బంగార్రాజుకి ఎంతంటే?

బంగార్రాజుకి ఎంతంటే?

ఇక బంగార్రాజు సినిమాతో మొదటిసారి కృతి శెట్టి అత్యధిక పారితోషికాన్ని అందుకుంది. మొదటి సినిమా వంద కోట్ల మార్కెట్ ను క్రియేట్ చేయడంతో ఈ బ్యూటీకి మంచి డిమాండ్ ఏర్పడింది. వరుసగా పెద్ద పెద్ద ఆఫర్లు వస్తుండడంతో అమ్మడం బంగార్రాజు సినిమాల్లో నటించేందుకు దాదాపు రెండు కోట్ల వరకు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.

మరింత పెరిగే అవకాశం..

మరింత పెరిగే అవకాశం..

అసలైతే బంగార్రాజు సినిమా ఆఫర్ ఉప్పెన సినిమా విడుదల కంటే ముందే వచ్చిందట. ఇక ఉప్పెన ఆ సినిమాకు కేవలం 25 లక్షల లోపు తీసుకున్న కృతి శెట్టి ఈ సినిమాకు మాత్రం ఒక్క సారిగా రెండు కోట్లకు రావడం విశేషం. ఇక బంగార్రాజు సినిమా కంటే ముందు శ్యామ్ సింగ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X