twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నమ్మలేరు: సంక్రాంతి సినిమాలపై మనందరి ఖర్చు ఇంత

    By Srikanya
    |

    హైదరాబాద్: సినిమాలకు కలెక్షన్స్ వస్తున్నాయంటే అర్దం ఏంటి...ప్రేక్షకుడు అంటే మనం మన జేబులోంచి తీసి డబ్బు ఖర్చు పెడుతున్నాడనేగా. అలాగే సంక్రాంతికి రిలీజైన నాలుగు సినిమాలకు మొత్తం మనం పెట్టిన ఖర్చు అంటే వాటికి వచ్చిన మొత్తం కలెక్షన్స్ అన్నమాట. అదెంతో తెలిస్తే ఇంతా అని ఆశ్చర్యపోతారు.

    తెలుగు సినిమా సంక్రాంతి చరిత్రలోనే కొత్త అధ్యాయం మెదలైంది. ఈ సంక్రాంతి కి విడుదలైన నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్ని నాయినా, డిక్టేటర్ మరియు ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలు అన్నీ హిట్ టాక్ తో కలెక్షన్స్ వర్షం కురిపించాయి. ఏదో ఒక సినిమాని ఆదరించకుండా అన్ని సినిమాలనూ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

    ఈ నాలుగు సినిమాలు కలిపి ఇప్పటివరకు , మేజిక్ నెంబర్ అయిన 222 కోట్ల గ్రాస్ సాధించింది. ఇందులో కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 167 కోట్లు వున్నాయని సమాచారం. మిగిలిన ఎమౌంట్ ...55 కోట్లు కర్ణాటక, తమిళనాడు, ఓవర్ సిస్ మెదలైన వాటినుండి వచ్చినవే.

    ఈ సంక్రాంతి చాలా గ్రాండ్ గా ఓపెన్ అవ్వడం, అది ఇంకా కొనసాగడం చూస్తుంటో మళ్ళీ తెలుగు సినిమాకు వైభోగం వచ్చినట్టు కనిపిస్తోంది. ఇది నిజంగా చాలా ఎక్కువ వసూళ్ళు సాదించిన సంక్రాంతి అని ఫిల్మ్ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతకీ మీరు సంక్రాంతికి ఏ సినిమాలు చూసారు.

    2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడే చిన్నినాయినా, మరియు ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ నాలుగు సినిమాలకు హిట్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సోగ్గాడే చిన్ని నాయినాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. దాంతో ప్రేక్షకులు ఈ నాలుగు సినిమాల్లో తమకు నచ్చిన సినిమాని ఎంచుకుని చూస్తున్నారు.

    Sankranthi Movies collected overal Magical Figure

    ఓ రకంగా నాలుగు సినిమాలు హిట్టే కానీ కలెక్షన్స్ ని షేర్ చేసుకోవాల్సిన పరిస్ధితి ఈ నాలుగు సినిమాలకు ఏర్పడింది. అదే ఏ ఒక్క సినిమానో హిట్టై ఉంటే ఆ సినిమానే కలెక్షన్స్ మొత్తం ఎత్తుకుపోయేది. ఈ విషయం సంక్రాంతి దర్శకులు కలిసి చేసిన చిట్ చాట్ లోనూ వచ్చింది.

    డైరక్టర్స్ అందరినీ కలిసి చిట్ చాట్ నిర్వహించారు ఓ మీడియా హౌస్ వారు. ఈ సందర్బంగా జరిగిన మాటల్లో, బాక్స్ ఆఫీస్ కు సంబందించి ఆడియన్స్ దగ్గరనుండి వచ్చిన రిపోర్ట్స్, రెస్పాన్స్ గురించి వారి మాటల్లో చెప్పుకున్నారు.

    డిక్టేటర్ డైరక్టర్ శ్రీవాస్ మాట్లడుతూ, సుమారు 15 శాతం ప్రి రిలీజే బిజినెస్ ని త్యాగం చెయ్యాల్సి వచ్చిందని, ఇది రెవిన్యూ జనరేట్ చెయ్యడంలో కోద్దిగా ఇబ్బంది కలిగిందని, అయినా కలెక్షన్స్ మాత్రం అందరూ షేర్ చేసుకున్నారని అన్నారు.

    మరో ప్రక్క సుకుమార్ మాత్రం... రాజమౌళికి ధ్యాంక్స్ తెలిపారు, దీనికి కారణంగా బాహుబలి సినిమాతో ఆడియన్స్ మళ్ళీ దియోటర్ వైపు మళ్ళించినందుకు. సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాలు హిటే అవ్వడానికి చాన్స్ ఎర్పడటంలో ఇది మంచి కారణం అయ్యిందని తెలిపారు. ఇంచుమించు ఇదే బావాన్ని మిగిలిన ఇద్దరైన గాంధీ, కళ్యాన్ కృష్ణ తెలిపారు.

    English summary
    This Sankranthi season four movies combined amassed around Rs.222 Crore gross. Rs.167 Crore of that came from both the Telugu states .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X