Sankranthiki Vasthunam AP TG Collections: 150 కోట్లతో ‘సంక్రాంతి’ రికార్డుల మోత.. వెంకీ బాక్సాఫీస్ ఊచకోత

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో రూపొందిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేశ్, వీకే నరేష్, వీటీ గణేష్, సాయి కుమార్, పమ్మి సాయి, సర్వదమన్ బెనర్జీ తదితరులు నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు. జనవరి 14వ తేదీన రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబడుతున్నది. ఈ సినిమా 6 రోజుల్లో ఆంధ్రా, నైజాంలో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకోవడం, పాటలకు మంచి రెస్సాన్స్ రావడంతో విడుదలకు ముందే హిట్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. దాంతో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఈ సినిమా బిజినెస్ ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయల మేర జరిగింది. వెంకటేశ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాను ఏపీ, నైజాంలో సుమారుగా 800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Sankranthiki Vasthunam 6 Days Box Office Collections in Andhra Nizam Dil Raju Movie racing towards 150 crores milestone

సంక్రాంతికి వస్తున్నాం సినిమా తెలుగు రాష్ట్రాల్లో రాబట్టిన వసూళ్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 17.2 కోట్లు, 2వ రోజు 14.5 కోట్లు, 3వ రోజు 13 కోట్లు, 4వ కోట్లు 12 కోట్లు, 5వ రోజు 13 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 70 కోట్ల షేర్, 110.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తొలి రోజు కంటే ఆ తర్వాత రోజుల్లోనే అంతకు మించి కలెక్షన్లు రాబట్టడం విశేషంగా మారింది.

ఇక గత 5 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 21 కోట్లకుపైగా, సీడెడ్‌లో 11 కోట్లకుపైగా, ఉత్తరాంధ్రలో 9.5 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 8 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 5.5 కోట్లు, గుంటూరు జిల్లాలో 6.5 కోట్లు, కృష్ణా జిల్లాలో 6 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 2.6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 70 కోట్ల షేర్.. 110.5 కోట్ల గ్రాస్ వసూళ్లను తెలుగు రాష్ట్రాల్లోనే రాబట్టింది.

Sankranthiki Vasthunam 6 Days Box Office Collections in Andhra Nizam Dil Raju Movie racing towards 150 crores milestone

ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా 6వ రోజు వసూళ్ల వివరాల్లో వెళితే.. నైజాంలో 4 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 1.25 కోట్లు, పవ్చి గోదావరి జిల్లాలో 70 లక్షలు, క‌ష్ణా జిల్లాలో 1 కోటి రూపాయలు, గుంటూరులో 90 లక్షలు, వైజాగ్‌లో 2.2 కోట్లు, సీడెడ్‌లో 2.15 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 12.5 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా 35 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. గత 6 రోజుల్లో 82 కోట్ల షేర్, 130 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 7వ రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 150 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా 50 కోట్లకుపైగా లాభాలను పంచిపెట్టింది. ఈ చిత్రం రానున్న రోజుల్లో ఏ రేంజ్ ప్రాఫిట్‌ను షేర్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X