Sankranthiki Vasthunam Collections: సంక్రాంతికి వస్తున్నాం వసూళ్ల ఊచకోత.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేశ్, వీకే నరేష్, వీటీ గణేష్, సాయి కుమార్, పమ్మి సాయి, సర్వదమన్ బెనర్జీ తదితరులు నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, నమోదైన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భారీ తారాగణం, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేశారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. సుమారుగా 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది.

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అందించిన పాటలు అత్యంత ప్రేక్షకదారణ పొందడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ మూవీపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని 1300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. భారీ అంచనాలతో ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. దాంతో రికార్డు కలెక్షన్లు నమోదు కావడానికి అవకాశం ఏర్పడింది.
ఇక ఈ మూవీ తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఏపీ, నైజాంలో భారీగా వసూలు చేసింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి 16 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇతర రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు, కర్ణాటక, నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో కలిపి ఈ సినిమా 18 కోట్ల రూపాయలు రాబట్ట వచ్చని పేర్కొన్నారు. దాంతో ఈ సినిమా మొత్తంగా 36 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధిస్తుందని అంచనా వేశారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే..ఈ చిత్రం ముందు భారీగా లక్ష్యం ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా ఏ మేరకు లాభాలను సాధిస్తుందనేది కొన్ని రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.


Click it and Unblock the Notifications











