Sankranthiki Vasthunam day 6 Collections: సంక్రాంతికి వస్తున్నాం వసూళ్ల మాస్ జాతర.. 200 కోట్లకు చేరువగా వెంకీ
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో రూపొందిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేశ్, వీకే నరేష్, వీటీ గణేష్, సాయి కుమార్, పమ్మి సాయి, సర్వదమన్ బెనర్జీ తదితరులు నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, గత 6 రోజుల్లో నమోదైన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భారీ తారాగణం, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేశారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. సుమారుగా 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల గ్రాస్, 24 కోట్ల షేర్ వసూలు చేసింది. ఏపీలో 26 కోట్ల గ్రాస్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 5 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 9.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
ఇక రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఏపీ, నైజాంలో 21 కోట్ల గ్రాస్, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల గ్రాస్ రాబట్టింది. దాంతో ఈ సినిమా 26 కోట్ల గ్రాస్, 15 షేర్ వసూలు చేసింది. 3వ రోజు 23 కోట్ల గ్రాస్, 15 కోట్ల షేర్, 4వ రోజు 21.5 కోట్లు, 5వ రోజు 27 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 1వ రోజు 23 కోట్లు, రెండో రోజు 21 కోట్లు, 3వ రోజు 20 కోట్లు, 4వ రోజు 17.5 కోట్లు, 5వ రోజు 19 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఆంధ్రా, నైజాంలో 100 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది. ఇక కర్ణాటకలో 8 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.25 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 2.5 కోట్ల రూపాయలు నికరంగా గత 5 రోజుల్లో వసూలు చేసింది. దాంతో 161 కోట్ల రాబట్టింది.

ఇక 6వ రోజు ఆదివారం ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. సంక్రాంతికి వస్తున్నాం మూవీకి మాస్ జాతరను థియేటర్లలో కొనసాగిస్తున్నది. ఈ చిత్రం తొలి రోజుకు మించి 6వ రోజు కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా 6వ రోజు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయలు, ఆంధ్రా, నైజాంలో 23 కోట్ల రూపాయలు వసూలు చేసిందని తెలిపారు. దాంతో ఈ సినిమా ఇప్పటి వరకు 190 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











