Sankranthiki Vasthunam Business:సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ బిజినెస్..వెంకటేష్ మూవీ లాభాల్లోకి రావాలంటే
విక్టరీ వెంకటేష్, వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి, ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. జనవరి 14న ఈ చిత్రం సంక్రాంతి కానుకగగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..
సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ తారాగణం, సాంకేతిక నిపుణులతో కలిసి నిర్మించారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ అంతా కలిపి ఈ చిత్రాన్ని సుమారుగా 90 కోట్ల రూపాయలతో నిర్మించారు. చిత్రంలోని పాటలు రిలీజ్‌కు ముందే ట్రెండింగ్ కావడంతో పాజిటివ్‌గా మారడం, అంతేకాకుండా భారీగా బిజినెస్ అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం హక్కులను సుమారుగా 20 కోట్ల రూపాయలుగా వ్యాల్యూ కట్టారు. సీడెడ్ హక్కులు 10 కోట్లు, ఉత్తరాంధ్ర, 8 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి 5 కోట్లు, పశ్చిమ గోదావరి 4.5 కోట్లు,గుంటూరు 5 కోట్లు, కృష్ణా 5 కోట్లు, నెల్లూరు 3 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దాంతో ఏపీ, నైజాంలో సుమారుగా 60 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది.
ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. 4 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 1.5 కోట్ల రూపాయలు, నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ 1.35 మిలియన్ డాలర్లు అంటే 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. అలాగే ఓవర్సీస్ మిగితా దేశాల్లో కలిపి 10 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైంది. దాంతో ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 88 కోట్ల మేర బిజినెస్ క్లోజైంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ భారీగానే సెట్ అయింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 90 కోట్ల షేర్ 180 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా రానున్న రోజుల్లో ఏ మేరకు లాభాలను సాధిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











