Don't Miss!
- News
వరంగల్లో చిరంజీవి వాల్తేరు వీరయ్య ఫీవర్: నేడు ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో మెగా బాస్పార్టీ!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో ఈ సీన్స్ చూసి.. ఫ్యాన్స్ కూడా షాక్!
- Finance
Colaphone: కోకాకోలా నుంచి స్మార్ట్ ఫోన్.. ఇవే కోలాఫోన్ ప్రత్యేకతలు
- Automobiles
రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన వారికి గొప్ప గుర్తింపు.. వీడియో
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Sankranti Movies: బాక్సాఫీస్ వద్ద ఏ సినిమాకు ఎంత రావాలి.. టాప్ లో వారసుడు, వీరయ్య!
సంక్రాంతి అనగానే సినిమా ఇండస్ట్రీలోకి ప్రత్యేకమైన వాతావరణ కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా ఈ ఫెస్టివల్ లో ఎలాంటి సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటుంది అని నిర్మాతల్లో ఒక బలమైన నమ్మకం అయితే ఉంటుంది. అయితే ఈ సంక్రాంతికి ఒకేసారి నాలుగో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. వారిసు (వారసుడు), వాల్తేరు వీరయ్య, తునివు (తెగింపు) అలాగే విరసింహారెడ్డి ఈ నాలుగు సినిమాలపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఏ సినిమా ఎంత థియేట్రికల్ బిజినెస్ చేసింది బాక్సాఫీస్ వద్ద ఎంత వస్తే సక్సెస్ అయినట్లు లెక్క అనే వివరాల్లోకి వెళితే..

రెండు భాషల్లో సినిమాల సందడి
ఈ సంక్రాంతి తెలుగు అలాగే తమిళ్ ఇండస్ట్రీకి చాలా స్పెషల్ గా నిలవబోతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగులో ఎలాగైతే మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ మధ్యలో పోటీ ఉందో అలాగే తమిళంలో విజయ్ అజిత్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నాలుగు సినిమాల హీరోలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. వారిసు తమిళ్ లో జనవరి 11న వస్తుండగా, తెలుగులో 14న వస్తోంది. వీర సింహా రెడ్డి జనవరి 12, వాల్తేరు వీరయ్యా జనవరి 13న రాబోతున్నాయి. ఇక తునివు/తెగింపు తెలుగు తమిళ్ లో జనవరి 11న రాబోతోంది.

వారిసు టార్గెట్
విజయ్ వారిసు సినిమా తెలుగులో వారసుడు సినిమాగా విడుదలవుతున్న విషయం తెలిసింది. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఇక ఈ సినిమా తెలుగు తమిళ్ లో భారీ స్థాయిలోనే విడుదలవుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా వారసుడు సినిమా 140 కోట్ల వరకు బిజినెస్ చేసింది. సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే 141 కోట్లయినా తప్పకుండా అందుకోవాల్సి ఉంటుంది.

వాల్తేరు వీరయ్యకు ఎంత రావాలి?
ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా భారీ స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్లోనే నిర్మించింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే 91 కోట్లు అందుకోవాల్సి ఉంటుంది.

తునివు థియేట్రికల్ బిజినెస్
ఇక అజిత్ నటించిన యాక్షన్ మూవీ తెలుగులో కూడా తెగింపు అనే టైటిల్ తో విడుదలవుతోంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ నిర్మించారు. ఇక ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 85 కోట్ల వరకు జరిగింది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే 86 కోట్లు అందుకోవాల్సి ఉంటుంది.

వీరసింహారెడ్డి రెడ్డి ఈజి టార్గెట్?
ఇక నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇక వీర సింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా చేసిన థియేట్రికల్ బిజినెస్ 72 కోట్లు. ఒక విధంగా బాలయ్య బాబుకు ఈ టార్గెట్ చాలా చిన్నది అని అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడున్న సినిమాల్లో ఎక్కువగా ఈ సినిమాకే ఎక్కువ బజ్ ఉంది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈజీగా సినిమా 90 కోట్ల షేర్ అందుకుంటుందని అనిపిస్తోంది.