Santhana Prapthirasthu Day 1 Collections: సంతాన ప్రాప్తిరస్తు కలెక్షన్స్.. చిన్న సినిమా ఎంత రాబట్టిందంటే?

కలర్ ఫోటో చిత్రంతో టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు అచ్చ తెలుగు అమ్మాయి చాందినీ చౌదరి. ఆ తర్వాత సమ్మతమే, గామి, మ్యూజిక్ షాప్ మూర్తి, యేవం తదితర చిత్రాలతో హీరోయిన్‌గా అలరించారు. తాజాగా చాందినీ చౌదరి లీడ్ రోల్‌లో నటించిన చిత్రం సంతాన ప్రాప్తిరస్తు. టీజర్, ట్రైలర్లు, లుక్‌తో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో సంతాన ప్రాప్తిరస్తు మూవీ బడ్జెట్ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా తొలి రోజు ఎన్ని కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టిందో చూస్తే..

సంతాన ప్రాప్తిరస్తు తారాగణం
సంతాన ప్రాప్తిరస్తు మూవీలో చాందినీ చౌదరితో విక్రాంత్ రెడ్డి ఆడిపాడారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కీలకపాత్ర పోషించారు. అనిల్ గీలా, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్, సత్యకృష్ణ, తాగుబోతు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సంతాన ప్రాప్తిరస్తు చిత్రానికి సంజీవ రెడ్డి దర్శకత్వం వహించగా.. షేక్ దావూద్ జీ కథను అందించారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించగా.. మహీరెడ్డి పండుగుల సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. సాయికృష్ణ గానాల ఎడిటర్‌గా, శివకుమార్ మచ్చా ప్రొడక్షన్ డిజైనర్‌గా సేవలందించారు.

సంతాన ప్రాప్తిరస్తు బడ్జెట్ ఎంతంటే?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికంతో కలిపి సంతాన ప్రాప్తిరస్తు చిత్రానికి దాదాపు 6 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. చిన్న సినిమాయే అయినప్పటికీ నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా, ఖర్చుకు రాజీపడకుండా ఈ సినిమాను నిర్మించారు నిర్మాతలు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అందమైన లోకేషన్స్‌లో సంతాన ప్రాప్తిరస్తు సినిమా చిత్రీకరణ జరుపుకుంది. మధుర ఆడియో, హౌస్‌ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చేపట్టిన ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

Santhana Prapthirasthu Day 1 expected Box Office Collections Worldwide Chandini Chowdary s movie good start at GBOC

సంతాన ప్రాప్తిరస్తు బ్రేక్ ఈవెన్ టార్గెట్?
సంతాన ప్రాప్తిరస్తు సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ఏ స్థాయిలో జరిగిందనే దానిపై వివరాలు తెలియరాలేదు. అయితే టాలీవుడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం సంతాన ప్రాప్తిరస్తు డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో హక్కులకు మంచి బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. సంతాన ప్రాప్తిరస్తు చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 12 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

సంతాన ప్రాప్తిరస్తు తొలి రోజు కలెక్షన్స్
కాంత, దే దే ప్యార్ దే 2, జిగ్రిస్ తదితర చిన్నాపెద్దా సినిమాలు బరిలో ఉన్న దశలో కంటెంట్‌పై నమ్మకం ఉంచి నవంబర్ 14న థియేటర్‌లలో దిగింది సంతాన ప్రాప్తిరస్తు. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో చాందినీ చౌదరి సినిమాకు మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తొలి రోజు సంతాన ప్రాప్తిరస్తు మూవీకి వరల్డ్ వైడ్‌గా కోటి 20 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి ఈ చిన్న సినిమా ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X