Sridevi Shoban Babu closing collections: చిరంజీవి కూతురు సినిమా.. ఊహించని నష్టాలు!
బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యువ హీరోలలో సంతోష్ శోభన్ ఒకరు. వర్షం దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ మొదటి నుంచి కూడా చాలా వర్క్ చేస్తూ గుర్తింపు అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. తండ్రి మరణించిన తరువాత హీరోగా నిలదొక్కుకోవాలి అని 20 ఏళ్ళ వయసులోనే సినిమా కెరీర్ ను స్టార్ట్ చేశాడు. ఇక రీసెంట్ గా అతను శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఆ సినిమా మొత్తంగా ఎంత కలెక్షన్స్ అందుకుంది? ఏ స్థాయిలో నష్టాలను కలిగించింది అనే వివరాల్లోకి వెళితే..

మెగాస్టార్ కూతురు నిర్మాతగా..
శ్రీదేవి శోభన్ బాబు సినిమాను ప్రశాంత్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెరపైకి తీసుకు రాగా గౌరీ అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా నటించింది. ఇక సంతోష్ శోభన్ డిఫరెంట్ పాత్రలో కనిపించాడు. ఇక ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మించారు. ఆమె ప్రొడక్షన్ లో వచ్చిన మొదటి సినిమా కావడంతో ఓ వర్గం ఆడియెన్స్ లో కొంత హైప్ అయితే క్రియేట్ అయ్యింది.

ఆమె భర్త కూడా..
ఇక ఈ సినిమా విడుదల తరువాత అంతగా పాజిటివ్ టాక్ ఏమి అందుకోలేదు. అంతకుముందు శోభన్ సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. అందుకే ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి అనుకున్నాడు. ఇక ఈ సినిమా కోసం రెగ్యులర్ ప్రమోషన్ లో కొంత బజ్ క్రియేట్ చేశారు. సుస్మిత తో పాటు ఆమె భర్త కూడా ఈ సినిమా ప్రొడక్షన్ లో ఒక భాగస్వామిగా ఉన్నారు..

బడ్జెట్ ఎంతంటే..
శ్రీదేవి శోభన్ బాబు రిలీజ్ అనంతరం రొటీన్ స్టోరీ అనే టాక్ అందుకుంది. ఇక ఈ సినిమాను రేంజ్ కు తగ్గట్టుగా తక్కువ థియేటర్లలో విడుదల చేశారు. 2.2 కోట్ల ఖర్చుతో ఈ సినిమాను నిర్మించారు. మొదట మంచి డిమాండ్ ఉంటుందని సుస్మిత ఈ సినిమాను ఖర్చుకు వెనకడకుండా తెరకెక్కించారు. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద 2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైంది.

మొదటి వారం కలెక్షన్స్
అయితే ఆ రేంజ్ లో సినిమా కోసం ఖర్చు చేసినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ దశలో కూడా ఆకట్టుకోలేక పోయింది. సినిమా టోటల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ వీక్ లో 40 లక్షల లోపు గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత మిగిలిన రోజుల్లో అంతగా కలెక్షన్స్ పెంచుకోలేదు. ప్రమోషన్ హడావుడి చేసినా కూడా కంటెంట్ జనాలకు కనెక్ట్ కాలేదు.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే..
మొదటి వారం అనంతరం సినిమా మిగతా తొజుల్లో అటు ఇటుగా 20 లక్షల లోపు గ్రాస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో అక్కడక్కడా కొన్ని లొకేషన్స్ లో విడుదలైనప్పటికీ ఏమి రాలేదు.

మొత్తం నష్టాలు..
ఇక బాక్సాఫీస్ దగ్గర శ్రీదేవి శోభన్ బాబు టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 60 లక్షల లోపు గ్రాస్ సాధించింది. ఇక టోటల్ గా సినిమా అటూ ఇటూగా 30 లక్షల లోపు ఉంటుందని చెప్పాలి. ఇక సినిమాకు కలెక్షన్స్ పెరగడంతో సినిమాను మొదట్లోనే చాలా థియేటర్ల నుంచి తీసేశారు. ఇక మొత్తంగా ఈ సినిమా థియేట్రికల్ గా 2 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.


Click it and Unblock the Notifications











