50 కోట్లు కొల్లగొట్టిన స్టార్ హీరో కూతురు.. బాలీవుడ్ వర్గాలు షాక్!
బాలీవుడ్ సూపర్‌స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ నటించిన కేదార్‌నాథ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలుకడగా వసూల్లు సాధిస్తున్నది. తొలి చిత్రంతోనే సారా భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. సారా నటనపై సినీ ప్రముఖులతోపాటు ప్రేక్షకులు భారీగా ప్రశంసలు గుప్పిస్తున్నారు. గతవారం కలెక్షన్లు భారీగా ఉండటమే కాకుండా క్షీణించకుండా స్టడీగా దూసుకెళ్లడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే..

అందమైన ప్రేమకథగా
2013లో కేదార్‌నాథ్ ఆలయాన్ని ముంచేసిన వరద బీభత్సం ఆధారంగా కేదార్‌నాథ్ తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ప్రేమ కథగా దర్శకుడు అభిషేక్ కపూర్ మలిచిన తీరుపై సినీ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా అలీ ఖాన్ కెమిస్ట్రీకి మంచి పేరు వచ్చింది. దాంతో ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తున్నది.

వారంలోపలే 50 కోట్లు
బాక్సాఫీస్ వద్ద సారా అలీ ఖాన్ చిత్రం రూ.50 కోట్లు కొల్లగొట్టింది. ఎనిమిదో రోజున కేదార్‌నాథ్ చిత్రం 50 కోట్ల మార్క్ దాటింది. ఏడురోజుల్లో 42 కోట్లు సాధించిన ఈ చిత్రం వసూళ్ల పరంగా దూసుకెళ్తున్నది. ఈ చిత్రం వారం తర్వాత రూ.51.4 వద్ద నిలిచింది. కెనడా, యూఎస్‌లో భారీ కలెక్షన్లను సాధిస్తున్నది.

2 వేలకుపైగా థియేటర్లలో
ప్రపంచవ్యాప్తంగా కేదార్‌నాథ్ చిత్రం భారీ సంఖ్యలో రిలీజైంది. దాదాపు 2000 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. రిలీజ్ రోజున 7.25 కోట్లు, శనివారం 9.75 కోట్లు, ఆదివారం రూ.10.75 కోట్లు సాధించింది.

డిసెంబర్ 7 నుంచి కలెక్షన్ల జోష్
విడుదలైన ప్రతీ చోట భారీ కలెక్షన్లు సాధించడంతో సైఫ్ ఖాన్ కుటుంబంలో సంతోషం నింపింది. ఈ చిత్రాన్ని రోనీ స్క్రివ్ వాలా, అభిషేక్ కపూర్ సంయుక్తంగా రూపొందించారు. డిసెంబర్ 7న రిలీజైన ఈ చిత్రం విశేష ఆదరణతో ముందుకెళ్లడంతో సినీ వర్గాల్లో జోష్ నింపింది.


Click it and Unblock the Notifications











