Zara Hatke Zara Bachke Collections హిట్ టాక్‌తో జరా హట్కే జరా బచ్కే.. వికీ, సారా మూవీకి ఏ రేంజ్ కలెక్షన్లంటే?

ప్రతి మనిషికి సొంత ఇంటి కల జీవితాశయంగా ఉంటుంది. మధ్య తరగతి కుటుంబాలకు సొంత ఇంటి కల చిరకాల స్వప్పంగా మారిపోతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సొంత ఇంటి కల సాకారం చేసుకొనే కథా నేపథ్యంతో రూపొందిన చిత్రం జరా హట్కే జరా బచ్కే. వికీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. జూన్ 2వ తేదీన రిలీజైన చిత్రం బడ్జెట్ ఎంత? తొలి రోజు కలెక్షన్లు ఎంత? బ్రేక్ ఈవెన్ లక్ష్యం ఎంత అనే వివరాల్లోకి వెళితే..

జరా హట్కే జరా బచ్కే చిత్రాన్ని భారీ తారాగణంతో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని 55 కోట్ల రూపాయల బడ్జెట్‌తో భారీగా రూపొందించారు. ఈ సినిమాను దేశవ్యాప్తంగా 1800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఉత్తరాదిలో భారీగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఫ్యామిలీ, ఫన్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. తొలి రోజు 22 వేల టికెట్లు మల్టీ‌ప్లెక్స్‌లో అమ్ముడుపోయాయి.

Zara Hatke Zara Bachke Collections

జరా హట్కే జరా బచ్కే చిత్రం ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మీడియం రేంజ్ ఆక్యుపెన్సీ నమోదయ్యాయి. మార్నింగ్ షో 15 శాతం, మ్యాట్నీ 20 శాతం, ఫస్ట్ షోకు 20 శాతం, సెకండ్ షోకు 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ చిత్రం ఓవరాల్‌లో 23 శాతం ఆక్యుపెన్సీతో తొలి రోజు బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

జరా హట్కే జరా బచ్కే చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఓ మోస్తారు కలెక్షన్లను సాధించింది. ఇండియాలో ఈ చిత్రం 5.49 కోట్ల షేర్ సాధించింది. ఇక ఓవర్సీస్‌లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 6.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. రెండో రోజు, మూడో రోజు సెలవు దినాలు కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం కలుగుతున్నది.

Zara Hatke Zara Bachke Collections

ఇక జరా హట్కే జరా బచ్కే చిత్రం బ్రేక్ ఈవెన్ లక్ష్యం విషయానికి వస్తే.. యావరేజ్ హిట్ కావాలంటే కనీసం బాక్సాఫీస్ వద్ద 55 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. ఇక సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవాలంటే.. కనీసం 65 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ చిత్రం ఏ రేంజ్ హిట్ అవుతుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X