The Legend Day 2 Collection ప్రపంచవ్యాప్తంగా 2500 స్క్రీన్లలో.. రెండో రోజు ఎంత వసూలంటే?
భారతీయ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అవుతున్న శరవణన్ స్టోర్స్ అధినేత శరవణన్ అరుల్ తన తొలి సినిమా ది లెజెండ్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించారు.51 ఏళ్ల వయసులో నట ఆరంగేట్రం చేయడం అందర్ని ఆశ్చర్యపరిచింది. ఊర్వశీ రటేలా, గీతిక, యోగిబాబు, సుమన్, నాజర్, ప్రభు, వివేక్, విజయ్ కుమార్ తదితరులు నటించారు. అయితే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం తొలి రోజు అంతే జోష్‌తో భారీ కలెక్షన్లను రాబట్టింది. అయితే రెండో రోజు ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందంటే..

45 కోట్ల బడ్జెట్‌తో
శరవణన్ అరుల్ దక్షిణాదిలో వ్యాపారవేత్తగా సుపరిచితుడు. నటనపై ఉన్న మక్కువతో ది లెజెండ్ సినిమాలో సైంటిస్ట్ పాత్రతో పరిచయం అయ్యారు. ఈ సినిమాను 45 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా ప్రచారం, టీజర్, ట్రైలర్లు అంచనాలు పెంచడంతో ది లెజెండ్ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది.

ప్రపంచవ్యాప్తంగా 2500 స్క్రీన్లలో
ది లెజెండ్ సినిమాకు భారీ అంచనాలు ఉండటంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తమిళనాడులోనే ఏకంగా 650 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమాకు తమిళనాడులోనే 5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టం శరవణన్‌కు, ది లెజెండ్‌కు ఉన్న క్రేజ్ ఏంటో తెలియజెప్పింది.

రెండో రోజు ఆక్యుపెన్సీ
అయితే ది లెజెండ్ సినిమా రెండో రోజు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి . తమిళనాడులో తొలి రోజు భారీ స్పందన కూడగట్టుకొన్న ఈ చిత్రం రెండో రోజు ఆ రేంజ్ ఆక్యుపెన్సీని రాబట్టలేకపోయింది. ప్యాన్ ఇండియాగా రిలీజైన ఈ చిత్రం హిందీ రాష్ట్రాల్లో ప్రభావం చూపలేకపోయింది. ఇక ఓవర్సీస్‌లో పేలవమైన కలెక్షన్లు రాబట్టింది.

రెండో రోజు 8 శాతం అక్యుపెన్సీతో
ఇక ది లెజెండ్ సినిమా రెండో రోజున దారుణమైన ఆక్యుపెన్సీ నమోదు చేసుకొన్నది. తమిళనాడులో 8.2 శాతం అక్యుపెన్సీ కనిపించింది. ఇండియాలోని ప్రధాన నగరాల్లో కూడా 8 శాతం కంటే ఎక్కువగా అక్యుపెన్సీ కనిపించలేదు. దాంతో ఇండియావ్యాప్తంగా 70 లక్షల నుంచి 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.

ది లెజెండ్ లాభాల్లోకి రావాలంటే?
ది లెజెండ్ సినిమా రెండో రోజుల్లో 7 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 66 కోట్లు రాబట్టాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమా లాభాల్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో ది లెజెండ్ ఏ ఏడాది భారీ నష్టాల్లో మిగిల్చిన సినిమాగా రికార్డు నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి


Click it and Unblock the Notifications











