The Legend day 3 Collection ప్రేక్షకులు లేక లెజెండ్ షోలు క్యాన్సిల్.. దారుణంగా మూడో రోజు ఎంతంటే
తమిళనాడుకు చెందిన శరవణన్ స్టోర్స్ అధినేత శరవణన్ అరుల్ 51 ఏళ్ల వయసులో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చేసిన చిత్రం ది లెజెండ్. దేశవ్యాప్తంగా శరవణన్ చేసిన ప్రమోషన్స్‌తో ఈ సినిమాపై భారీ క్రేజ్ లభించింది. అయితే టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపైనే కాకుండా శరవణన్‌పై ఓ ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్యాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన మూడో రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?

ప్రేక్షకులు ముఖం చాటేయడంతో
ప్రపంచవ్యాప్తంగా లెజెండ్ చిత్రం 2500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తమిళనాడులోనే ఏకంగా 650 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. తొలి రోజున తమిళనాడులో భారీ కలెక్షన్లను రాబట్టింది. రెండో రోజున భారీగా కలెక్షన్లు క్షీణించాయి. ఇక మూడో రోజున ప్రేక్షకులు లేకపోవడంతో పలు చోట్ల షోలు క్యాన్సిల్ అయ్యాయి.

47 శాతం కలెక్షన్లు డ్రాప్
ది లెజెండ్ సినిమా తొలి రోజున దేశవ్యాప్తంగా 1.2 కోట్లు రాబట్టింది.తమిళంలో 1.1 కోట్లు వసూలు చేస్తే.. తెలుగులో 10 లక్షలు రాబట్టింది. ఇక రెండో రోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా 63 లక్షలు సాధించింది. తమిళంలో 59 లక్షలు, తెలుగులో 4 లక్షల వసూళ్లకు పరిమితమైంది. రెండో రోజున 47 శాతం కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి.

మూడో రోజు ఆక్యుపెన్సీ ఎంతంటే?
ది లెజెండ్ సినిమా మూడో రోజున దారుణమైన ఆక్యుపెన్సీ నమోదు చేసింది. శనివారం ఈ సినిమా తమిళంలో 12 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. చెన్నై 21 శాతం,బెంగళూరు, పాండిచ్చేరి, ముంబై, కోయంబత్తూరు ప్రాంతాల్లో 10 శాతానికి పైగా వసూళ్లను నమోదు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో స్పందన కరువు
తెలుగు రాష్ట్రాల్లో భారీగా ది లెజెండ్ సినిమా ప్రమోషన్స్ జరిగాయి. దాంతో శరవణన్ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే క్రేజ్‌కు తగినట్టుగా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆంధ్రా, నైజాం రాష్ట్రాల్లో 4 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది.

బ్రేక్ ఈవెన్ సాధిస్తే మ్యాజిక్ చేసినట్టే..
లెజెండ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన లేకపోవడం వల్ల సగానికి సగం స్క్రీన్లలను ఎత్తివేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మూడో రోజు 50 లక్షల వసూళ్లను సాధించే అవకాశం ఉంది. దాంతో ఒకవేళ ఈ మొత్తం సాధిస్తే..మూడు రోజుల్లో 2.33 కోట్లు రాబట్టినట్టు అవుతుంది. ఈ సినిమా 65 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తే మ్యాజిక్ జరిగినట్టే అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











