The Legend టోటల్ కలెక్షన్లు.. 65 కోట్లతో మూవీ.. చివరకు ఎంత నష్టమంటే?
దక్షిణాది చిత్ర పరిశ్రమతోపాటు దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారి తీసిన చిత్రం ది లెజెండ్. తమిళనాడులో శరవణన్ గ్రూప్ అధినేత శరవణన్ అరుల్ హీరోగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు సంపాదించుకొన్న క్రేజ్‌ను బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లుగా మలచలేకపోయింది. అయితే 8 రోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల యాత్రను ముగించింది. ఈ సినిమా గురించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

66 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో
ది లెజెండ్ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 66 కోట్లు రాబట్టాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమా లాభాల్లోకి వచ్చే పరిస్థితి కనిపించలేదు. దాంతో ది లెజెండ్ ఏ ఏడాది భారీ నష్టాల్లో మిగిల్చిన సినిమాగా నమోదయ్యే అవకాశాలు మొదటి రోజు నుంచే కనిపించింది.

తొలి రెండు రోజుల్లో
దక్షిణాది సినిమా పరిశ్రమ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. తొలి రోజున ఈ చిత్రం 1.2 కోట్లు రాబట్టింది. తమిళంలో 1.1 కోట్లు, తెలుగులో 10 లక్షల రూపాయలు వసూళ్లను నమోదు చేసింది. ఇక రెండో రోజు ఈ చిత్రం 63 లక్షలు రాబట్టింది. తమిళంలో 59 లక్షలు, తెలుగులో 4 లక్షల రూపాయలను వసూలు చేసింది.
Recommended Video


మూడు, నాలుగు రోజుల్లో ఫర్వాలేదంటూ
ది లెజెండ్ సినిమా మూడో రోజుకు అక్యుపెన్సీ భారీగా డ్రాప్ అయింది. బాక్సాఫీస్ వద్ద తిరిగి కోలేకోలేని పరిస్థితుల్లో మూడో రోజు 84 లక్షలు సాధించింది. తమిళంలో 81 లక్షలలు, తెలుగులో 3 లక్షలు వసూలు చేసింది. ఇక నాలుగో రోజున ఈ చిత్రం 88 లక్షలు రాబట్టింది. తమిళంలో 85 లక్షలు, తెలుగులో 3 లక్షలు వసూలు చేసింది.

నాలుగు రోజు నుంచి దారుణంగా
ది లెజెండ్ చిత్రం 5 రోజున దారుణంగా పడిపోయింది. తమిళంలో 38 లక్షలు, తెలుగులో 2 లక్షలతో మొత్తంగా 40 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఆరో రోజున 37 లక్షలు, ఏడో రోజున 41 లక్షలతో మొత్తంగా ఈ చిత్రం 4.73 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. షేర్ విషయానికి వస్తే.. ఈ చిత్రం 2 కోట్లకుపైగా షేర్ సాధించింది.

ది లెజెండ్ మూవీ నష్టం ఎంతంటే?
ది లెజెండ్ చిత్రం 2022లో భారీ నష్టాలకు గురైన చిత్రంగా రికార్డును నమోదు చేసింది. 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తే.. ఈ సినిమా సుమారు మూడు కోట్లు కూడా రాబట్టలేకపోయింది. దాంతో ఈ చిత్రం 62 కోట్లకుపైగా నష్టాల్ని బాక్సాఫీస్ వద్ద చవిచూసింది.


Click it and Unblock the Notifications











