The Legend day 4 Collections ప్రేక్షకులు లేక ఆటలు రద్దు.. ఇప్పటి వరకు నష్టం ఎంతంటే?
తమిళనాడులో ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ అరుల్ హీరోగా నటించిన ది లెజెండ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవమైన వసూళ్లను సాధిస్తున్నది. భారీ బడ్జెట్, ప్రముఖ నటీనటులు, అత్యంత ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అంచనాల ఏ దశలోను చేరుకోలేక వసూళ్ల పరంగా చతికిల పడింది. ఇక 4వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే..

65 కోట్ల భారీ బడ్జెట్‌తో
ది లెజెండ్ చిత్రం 65 కోట్లతో తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 2500 స్క్రీన్లలో ప్రధానంగా తమిళనాడులో 650 స్క్రీన్లలో ప్రదర్శించారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 66 కోట్లు రాబట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులో జూలై 28 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తొలి మూడో రోజుల్లో
ది లెజెండ్ చిత్రం తొలి రోజున 1.2 కోట్లు రాబట్టింది. తమిళంలో 1.1 కోట్లు, తెలుగులో 10 లక్షలు రాబట్టింది. రెండో రోజున తమిళంలో 59 లక్ష్లలు, తెలుగులో 4 లక్షలతో కలిపి ఈ సినిమా 63 లక్షలు వసూలు చేసింది. మూడో రోజున తమిళంలో 81 లక్షలు, తెలుగులో 3 లక్షలతో కలిపి 84 లక్షలు వసూలు చేసింది.

నాలుగో రోజు దారుణంగా ఆక్యుపెన్సీ
ది లెజెండ్ మూవీ సెలవు దినమైన ఆదివారం కూడా ప్రభావం చూపలేకపోయింది. హైదరాబాద్‌లో 14 శాతం ఆక్యుపెన్సీ, వరంగల్‌లో 2 శాతం, కరీంనగర్‌లో ప్రేక్షకులు లేకపోవడంతో ఆటలు రద్దు చేయడం జరిగింది. ఇక విజయవాడలో 12 శాతం, గుంటూరులో 23 శాతం, కాకినాడలో 11 శాతం ఆక్యుపెన్సీ నాలుగో రోజున కనిపించింది.

నాలుగో రోజున వసూళ్లు ఎంతంటే?
ఇక ది లెజెండ్ చిత్రం నాలుగో రోజున ప్రపంచవ్యాప్తంగా మోస్తారు వసూళ్లు సాధించింది. తెలుగు, తమిళం, ఇతర భాషల్లో కలుపుకొని 1.8 కోట్ల గ్రాస్ వసూళ్లను, 80 లక్షల షేర్ రాబట్టింది. దాంతో ఈ చిత్రం నాలుగు రోజుల్లో 7.75 కోట్ల గ్రాస్ వసూళ్లను, 3.47 కోట్ల షేర్ సాధించింది.

భారీ నష్టాల్లోకి ది లెజెండ్
గత నాలుగు రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే.. ది లెజెండ్ చిత్రం భారీ నష్టాల్లోకి జారుకొన్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటి వరకు ఈ చిత్రం 3.5 కోట్లు రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం ఇంకా 63 కోట్లు వసూలు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో 2022లో భారీ నష్టాలను సాధించిన చిత్రంగా ది లెజెండ్ మిగిలిపోయే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











