Sardar Day 2 collections: హై రేంజ్ లోనే కార్తీ బాక్సాఫీస్ కలెక్షన్లు.. రెండవ రోజే ఎక్కువగా..
తమిళ హీరోలలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేయగలిగే టాప్ హీరోలలో కార్తీ ఒకరు. కమర్షియల్ అంశాలు ఎక్కువగా టచ్ చేయకుండా కార్తీ అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటాడు. ఇక తెలుగులో కూడా అతనికి మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈసారి ఎలాగైనా సర్దార్ సినిమాతో కార్తీ తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకోవాలి అని అనుకుంటున్నాడు. సర్దార్ సినిమా రెండవ రోజు ఎలాంటి కలెక్షన్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ బిజినెస్
పిఎస్.మిత్రన్ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన సర్దార్ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్బజ్ నటించింది. ఈ సినిమాలో కార్తీక్ ఒక గూడచారి పాత్రలో నటించాడు. అయితే సినిమా రేంజ్ కు తగ్గట్టుగానే మార్కెట్లో మంచి బిజినెస్ చేసింది. దాదాపు 35 నుంచి 40 కోట్ల భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మించారు. ఇక తెలుగులో అయితే సర్దార్ సినిమా 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే 41 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో
ఇక మొదటిరోజు ఈ సినిమా పాజిటివ్ టాక్ తోనే డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. రెండవ రోజు ఊహించిన విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలెక్షన్స్ పెరిగాయి. అలాగే తమిళంలో కూడా కలెక్షన్స్ పెరుగుతూ ఉండడం విశేషం ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో మొదటి రోజు సర్దార్ కేవలం 70 లక్షల షేర్ అందుకుంది. ఇక రెండవ రోజు 1. 05 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం.

రెండు రోజుల కలెక్షన్స్
రెండవ రోజు ఏరియాలో వారిగా అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజంలో 27 లక్షలు సీడెడ్ లో 23 లక్షలు, ఇక ఆంధ్రాలో మొత్తంగా 90 లక్షల షేర్ వచ్చింది. ఇక టోటల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు రోజుల్లో మొత్తంగా ఈ సినిమా రెండు కోట్ల షేర్ కలెక్షన్ సాధించింది. ఇక గ్రాస్ 3.55 కోట్లు దక్కింది.

ఇంకా ఎంత రావాలంటే..
తెలుగులో అయితే ఈ సినిమా ఐదు కోట్ల వరకు బిజినెస్ చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద 5.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇక మొదటి రెండు రోజుల్లో అయితే రెండు కోట్ల షేర్ కలక్షన్స్ వచ్చాయి. అంటే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే ఇంకా 3.50 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ సాధించుకోవాల్సి ఉంది.

మొత్తం ఎంతంటే?
ఇక తమిళంలో అలాగే తెలుగు భాషలో మొత్తంగా కలిపి మొదటి రోజు ఈ సినిమాకు 4.35 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక రెండో రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అంతకంటే ఎక్కువ స్థాయిలో 6.98 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. ఇక మొత్తంగా రెండు రోజుల్లో సర్దార్ ఇండియాలో 11.33 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











