Sardar Day 3 collections సర్దార్‌కు ఊహించని కలెక్షన్లు.. ప్రపంచవ్యాప్తంగా మూడో రోజు ఎంతంటే?

తెలుగు, తమిళ భాషల్లో కార్తీ నటించిన సర్దార్ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తున్నది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకొన్నది. గత రెండు రోజుల్లో భారీ వసూళ్లను సాధించిన ఈ చిత్రం మూడో రోజున కూడా మెరుగైన వసూళ్లను రాబట్టింది. అభిమన్యుడు దర్శకుడు పీఎస్ మిత్రన్ రూపొందించిన ఈ చిత్రం మూడో రోజున తెలుగు, తమిళ భాషల్లో ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే విషయంలోకి వెళితే..

సర్దార్ ప్రీ రిలీజ్ బిజినెస్

సర్దార్ ప్రీ రిలీజ్ బిజినెస్

కార్తీ నటించిన సర్దార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ బిజినెస్ నమోదు చేసింది. తమిళనాడు మినహాయిస్తే ఈ చిత్రం 64 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్‌గా రాబట్టింది. టెలివిజన్ , డిజిటల్ రైట్స్ 31 కోట్లు పలికాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ 11 కోట్ల మేర జరిగింది. తెలుగు థియేట్రికల్ రైట్స్ 8 కోట్లు, తెలుగు శాటిలైట్ రైట్స్ 3 కోట్లు పలికాయి. ఓవర్సీస్ రైట్స్ 6 కోట్ల మేర జరిగాయి. అలాగే కర్ణాటక, కేరళ థియేట్రికల్ హక్కులు రూ.2.6 లక్షల మేర బిజినెస్ జరిగింది.

3వ రోజున ఆక్యుపెన్సీ

3వ రోజున ఆక్యుపెన్సీ


సర్దార్ చిత్రం తమిళంలో మంచి ఆక్యుపెన్సీని నమోదు చేసింది. మూడో రోజున ఈ చిత్రం 50 శాతం ఆక్యుపెన్సీతో భారీ వసూళ్లను సాధించింది. తెలుగులో మూడు చిత్రాలు రిలీజ్ కావడంతో ఆక్యుపెన్సీ విషయంలో ఊగిసలాట కొనసాగింది. మూడో రోజున ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 35 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

3వ రోజున తెలుగు రాష్ట్రాల్లో

3వ రోజున తెలుగు రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాల్లో సర్దార్ చిత్రం తొలి రోజున 1.2 కోట్ల షేర్, రెండో రోజున 1.58 కోట్ల షేర్, మూడో రోజున 1.95 కోట్ల షేర్ సాధించింది. గత మూడు రోజుల్లో 4.73 కోట్ల షేర్, 8 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 5.5 కోట్లు రాబట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా 1.5 కోట్లు సాధిస్తే.. ఈ సినిమా ప్రాఫిట్ జోన్‌లోకి ప్రవేశిస్తుంది.

3వ రోజున తమిళ భాషలో

3వ రోజున తమిళ భాషలో

తమిళ భాషలో సర్దార్ సినిమా భారీ వసూళ్లను రాబడుతున్నది. తమిళంలో తొలి రోజున 3.15 కోట్లు, రెండో రోజున 5.4 కోట్లు, మూడో రోజున 6.28 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తమిళంలోనే 14.83 కోట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది.

అమెరికాలో మూడు రోజుల వసూళ్లు

అమెరికాలో మూడు రోజుల వసూళ్లు

సర్దార్ చిత్రానికి అమెరికాలో భారీగానే కలెక్షన్లను రాబడుతున్నది. ప్రీమియర్‌తో కలిపి తొలి రోజున 70k డాలర్లను వసూలు చేసింది. రెండో రోజ మరో 70k కలెక్షన్లను రాబట్టింది. మూడో రోజు కూడా 80K కలెక్షన్లను నమోదు చసింది. దాంతో ఈ చిత్రం భారతీయ కరెన్సీలో 2.2 కోట్లకుపైగానే వసూళ్లను రాబట్టింది.

ప్రపంచవ్యాపంగా వసూళ్లు

ప్రపంచవ్యాపంగా వసూళ్లు


సర్దార్ మూవీ దేశవ్యాప్తంగా గత మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజున 4.35 కోట్లు, రెండో రోజున 6.98 కోట్లు, మూడో రోజున 8.23 కోట్లు వసూలు చేసింది. తమిళంలో 15 కోట్లు, తెలుగులో 4.73 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో దేశవ్యాప్తంగా 21.75 కోట్లు రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X