Sardar Day 5 collections సర్దార్ కలెక్షన్ల జోరు.. కార్తీ మూవీ 5వ రోజు కలెక్షన్లు ఎంతంటే?
తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన సర్దార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లను సాధిస్తున్నది. దీపావళీ కానుకగా అక్టోబర్ 21వ తేదీన రిలీజైన ఈ చిత్రం దక్షిణాదిలో మంచి ఆదరణను సంపాదించుకొన్నది. గత నాలుగు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా వసూళ్లు సాధించిన ఈ చిత్రం 5వ రోజు కూడా భారీ కలెక్షన్లను సాధించింది. గత ఐదు రోజుల్లో ఈ చిత్రం ఏ మేరకు వసూళ్లను సాధించిందనే విషయంలోకి వెళితే..

తమిళంలో గత 4 రోజుల్లో
తమిళ భాషలో సర్దార్ కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు 3.15 కోట్లు, రెండో రోజున 4.55 కోట్లు, మూడో రోజున 5.35 కోట్లు, నాలుగో రోజున 6.77 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ ట్రెండ్ క్రియేట్ చేసింది. గత నాలుగు రోజుల్లో సుమారు 20 కోట్ల షేర్ తమిళనాడులో సాధించింది. ఇంకా ఈ చిత్రం భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసింది.

తెలుగులో 4 రోజులల్ో
ఇక సర్దార్ తెలుగు బాక్సాఫీస్ రిపోర్టు విషయానికి వస్తే.. తొలి రోజు 1.2 కోట్లు, రెండో రోజు 1.58 కోట్లు, మూడో రోజు 1.95 కోట్లు, నాలుగో రోజు 1.73 కోట్లు వసూలు చేసింది. గత నాలుగు రోజుల్లో నిలకడగా వసూళ్లను రాబట్టింది. గత నాలుగు రోజుల్లో 6 కోట్ల షేర్ సాధించింది. దీపావళీ సెలవులు ఈ సినిమాకు బాగా కలిసి వచ్చిందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

సర్దార్ 5వ రోజు తమిళ ఆక్యుపెన్సీ
ఇక ఐదో రోజు సర్దార్ కలెక్షన్ల వివరాల్లోకి వస్తే.. తమిళ వెర్షన్‌కు సంబంధించిన ఆక్యుపెన్సీ భారీగా నమోదైంది. చెన్నైలో 65 శాతం, మధురైలో 73 శాతం, కోయంబత్తూరులో 77 శాతం, పాండిచ్చేరిలో 99 శాతం, సలెం 88 శాతం, వెల్లూరులో 51 శాతం, దిండిగల్ 67 శాతం, త్రిచూరులో 95 శాతం కలెక్షన్లను సాధించింది.

తెలుగులో 5వ రోజు ఆక్యుపెన్సీ
తెలుగులో వెర్షన్ సర్దార్ విషయానికి వస్తే.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 5వ రోజు ఈ సినిమా సగటున 25 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. తమిళనాడుకు చేరువలోని తిరుపతిలో మాత్రం 50 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

యూఎస్ఏలో 5వ రోజు కలెక్షన్లు
అమెరికాలో సర్దార్ చిత్రం సానుకూలంగా వసూళ్లను సాధిస్తున్నది. గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం 243k డాలర్లను రాబట్టింది. ఐదో రోజున కూడా మరో 20k డాలర్లను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 260k డాలర్లను అంటే.. 2.15 కోట్లు వసూలు చేసింది.

సర్దార్ 5 రోజుల కలెక్షన్లు ఇలా
సర్దార్ చిత్రం 5వ రోజున 6.85 కోట్లు రాబట్టింది. గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం తమిళనాడులో 20 కోట్లు, తెలుగులో 6 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల షేర్ సాధించింది.


Click it and Unblock the Notifications











