Sardar Day 6 collections 50 కోట్ల క్లబ్‌లో సర్దార్.. 6వ రోజు ఊహించని కలెక్షన్లు

తమిళ స్టార్ హీరో కార్తీ, దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్‌లో వచ్చిన సర్దార్ చిత్రం భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తున్నది. వన్ ఇండియా.. వన్ పైప్‌లైన్ అనే కాన్సెప్ట్‌తో నీటి పేరుతో జరుగుతున్న భారీ కుంభకోణం నేపథ్యంగా ఈ సినిమా రూపొందింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించడంతోపాటు భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా 6వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

సర్దార్ చిత్రం తెలుగు భాషల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించిన ఈ చిత్రం లాభాల్లోకి ప్రవేశించింది. ప్రస్తుత ఏడాది టాలీవుడ్‌లో విజయం సాధించిన 15వ చిత్రంగా ఈ సినిమా రికార్డును క్రియేట్ చేసింది.

Sardar movie Day 6 collections worldwide: Karthi movie heading towards 50 crores

సర్దార్ చిత్రం తెలుగు, తమిళ భాషల వసూళ్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 4.35 కోట్లు, రెండో రోజు 6.13 కోట్లు, మూడో రోజు 7.3 కోట్లు, నాలుగో రోజు 8.35 కోట్లు, 5వ రోజున 6.9 కోట్లు వసూలు చేసింది. ఇక ఆరో రోజున ఈ సినిమా 3.30 కోట్లు రాబట్టింది.

సర్దార్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. తెలుగులో 6వ రోజున ఈ సినిమా 80 లక్షల వసూలు రాబట్టింది. ఇక గత 6 రోజుల మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో 2.53 కోట్లు, సీడెడ్‌లో 75 లక్షలు, ఆంధ్రాలో 2.59 కోట్ల వసూళ్లు సాధించింది. దాంతో ఈ సినిమా గత ఆరు రోజుల్లో 5.88 కోట్ల షేర్, 9.75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం 83 లక్షల లాభంతో కొనసాగుతున్నది.

సర్దార్ చిత్రం ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. అమెరికాలో ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తున్నది. గత ఐదు రోజుల్లో 24,965k డాలర్లను రాబట్టింది. భారతీయ కరెన్సీలో 2 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

ఇక సర్దార్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. గత 3 రోజుల్లో ఈ సినిమా 10 కోట్లకుపైగానే షేర్ సాధించింది. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ఈ సినిమా ఆరు రోజుల్లో 50 కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 65 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X