For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కెరీర్ లోనే హైయిస్ట్ రేటు పలికింది

  By Srikanya
  |

  హైదరాబాద్ : కొద్ది రోజులు క్రితం...పవన్ కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ ఓవర్ సీస్ బిజినెస్ గురించి సమచారం ఇచ్చాం. ఈరోస్ వాళ్లు ఈ రైట్స్ ని తీసుకున్నట్లు చెప్పాం. ఇప్పుడు ఆ రేటు ఎంతో బయిటకు వచ్చింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పది కోట్లు చెల్లించారని తెలుస్తోంది.

  ఇది పవన్ కళ్యాణ్ కు ఓవర్ సీస్ లో హైయిస్ట్ రేటు. ఇప్పటివరకూ ఏ చిత్రానికి ఇంత పలకలేదు. సినిమా ప్రారంభమైన రోజు నుంచీ ఈ చిత్రానికి ఓ రేంజిలో క్రేజ్ వస్తోంది. ఆ క్రేజ్ తోనే బిజినెస్ కూడా ఎవరూ ఊహించని స్దాయిలో జరుగుతోంది.

  ఇప్పటికే ఏప్రియల్ 8న ఈ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా బిజినెస్ ఊపందుకుంది. డిస్ట్రిబ్యూటర్స్ వద్దనుంచి పెద్ద పెద్ద ఎమౌంట్స్ తో ఆఫర్స్ వస్తున్నాయి. తమకే రైట్స్ కావాలంటూ కొందరు పవన్ ని డైరక్ట్ గా కలుస్తున్నారు.

  పవన్ కళ్యాణా మజాకా! ‘సర్దార్..' బిజినెస్ రూ. 100 కోట్లు!

  అయితే డిస్ట్రిబ్యూటర్స్ కు చేసే ఎగ్రిమెంట్ లో ‘నో రిఫెండ్' అనే క్లాజ్ పెట్టారని వినికిడి. ఈ క్లాజ్ అర్దం ఏమిటీ అంటే సినిమా కు లాస్ లు ఏదన్నా వస్తే... వెనక్కి నిర్మాతలు రూపాయి కూడా డిస్ట్రిబ్యూటర్స్ కు పే చెయ్యరన్నమాట.

  అయితే ఇది తమ సినిమా మీద కాన్ఫిడెంట్ ఉండటం చేతే ఇలాంటి క్లాజ్ పెట్టారని కొందరు అంటూంటే...అలాంటిదేమీ తమకు ఇంక ఆ సినిమా రిలిజ్ అయ్యాక సంబంధం లేకుండా చేయటానికే ఇలా పెట్టారని మరికొందరు అంటున్నారు. అదేమీ కాదు...అసలు తమ సినిమాపై కాన్ఫిడెంట్ లేకే ఇలాంటి క్లాజ్ పెట్టారని వెబ్ మీడియాలో వార్తలు సైతం వస్తున్నాయి.

  చిత్రం ధియోటర్ రైట్స్ విషయానికి వస్తే..వరల్డ్ వైడ్ రైట్స్ ని ఎరోస్ వారు తీసుకొని, అప్పుడే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఏరియాల బిజినెస్ ని కూడా క్లోజ్ చేసినట్లు సమాచారం.

  ఆ రోజులే వేరప్పా : పవర్ స్టార్ కాక ముందు పవన్ (రేర్ ఫొటోలు)

   Sardar’s overseas rights sold

  ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... 10.7 కోట్లకి సర్దార్ గబ్బర్ సింగ్ సీడెడ్ రైట్స్ అమ్ముడు పోయాయి. అలాగే.. వైజాగ్ రైట్స్ ని 7.2 కోట్లకి కొనుక్కున్నారు. ఓవర్ సీస్, నైజాం రైట్స్ ని ఎరోస్ వారే తమ దగ్గర ఉంచుకున్నారు.

  షెడ్యూల్ వివరాలకి వస్తే.. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకూ కేరళలో ఈ చిత్రం షూటింగ్ చేసారు. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంటే, లక్ష్మీ రాయ్, సంజనలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శరత్ మరార్ నిర్మాత.

  నిర్మాత మాట్లాడుతూ ''ఈ సినిమా 'గబ్బర్‌సింగ్‌'కు సీక్వెలో ప్రీక్వెలో కాదు. ఇదో కొత్త కథ. పవన్‌ చిత్ర కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకొన్నారు. సినిమాలోని భావోద్వేగాన్ని ప్రతిఫలించేలా టీజర్ ను రూపొందించాం. దేవిశ్రీప్రసాద్‌ అందించిన బాణీలు ఆకర్షణగా నిలుస్తాయి''అన్నారు.

  బాబి దర్శకతం వహిస్తున్న ఈ చిత్రానికి శరత్‌మరార్‌ నిర్మాత. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌.

  English summary
  Eros has bagged the overseas rights of Pawan Kalyan’s upcoming film Sardar paid a whopping 10 crores.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X