Sarfira Collections: అక్షయ్ కుమార్ మూవీకి టాక్ హిట్.. కలెక్షన్లు నిల్.. అత్యంత దారుణంగా ఎన్ని కోట్లంటే?
దక్షిణాదిలో సంచలన విజయం సాధించిన ఆకాశమే నీ హద్దురా సినిమాను రీమేక్ చేసి రూపొందించిన చిత్రం సర్పీరా. దక్షిణాదిలో సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందింది. అయితే అదే సినిమాను అక్షయ్ కుమార్ హీరోగా, రాధిక మదన్ హీరోయిన్‌గా, పరేశ్ రావెల్ ముఖ్య పాత్రలో, సూర్య అతిథి పాత్రలో నటించిన ఈ హిందీ మూవీకి కూడా సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సూర్య, జ్యోతికతోపాటు అరుణ భాటియా, విక్రమ్ మల్హోత్రా నిర్మించారు. జూలై 12వ తేదీన రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
సాధారణ పౌరుడికి కూడా విమాన ప్రయాణం చవకగా అందాలనే లక్ష్యంతో జీఆర్ గోపినాథ్ రచించిన సింప్లీ ఫ్లై: ఏ డెక్కన్ ఒడిస్సీ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమా బడ్జెట్ 80 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా 100 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఇక సర్ఫీరా (Sarfira) మూవీని భారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఇండియాలోనే 2500 స్క్రీన్లలో రిలీజ్ చేయగా.. ప్రపంచవ్యాప్తంగా 3200 స్క్రీన్లలో విడుదల చేశారు. దాంతో ఈ సినిమా కనీసం 100 కోట్ల బాక్సాఫీస్ వద్ద వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు వాల్యూ కట్టారు.
వరుసు డిజాస్టర్లతో కెరీర్ కొనసాగిస్తున్న అక్షయ్ కుమార్‌కు సర్పీరా కూడా పాజిటివ్‌గా కనిపించలేదు. ఈ సినిమా అడ్వాన్స్ చాలా పూర్‌గా ఉంది. ఇక రిలీజ్ రోజున కూడా కరెంట్ బుకింగ్ పెద్దగా స్పందన లేకపోవడంతో అన్ని చోట్ల కలిపితే 15 శాతం ఆక్యుపెన్సీ కనిపించలేదు. కానీ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మౌత్ టాక్‌పైనే ఆశలు పెట్టుకొన్నారు.
ఇక ఇండియాలో ఈ సినిమా చాలా దారుణమైన కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం సుమారుగా 1.75 కోట్ల రూపాయలు రాబట్ట వచ్చని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద రాబట్ట వచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. శని, ఆదివారాల్లో మెరుగైన కలెక్షన్లు సాధిస్తే తప్పా.. ఈ సినిమా యావరేజ్ మూవీగా కూడా నిలబడే పరిస్థితి ఉండదు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











