Sarfira 3 days Collections:అక్షయ్ కుమార్ మూవీకి 100 కోట్ల టార్గెట్..సూర్య, జ్యోతిక సినిమాకు షాకింగ్ కలెక్షన్లు

దక్షిణాదిలో ఘన విజయం సాధించిన చిత్రం ఆకాశమే నీ హద్దురా. సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రశంసలు అందుకొన్నది. అలాంటి సినిమాను హిందీలో రీమేక్ చేస్తూ బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో సూర్య, జ్యోతిక దంపతులు నిర్మించిన చిత్రం సర్ఫీరా (Sarfira). ఈ చిత్రం తాజాగా జూలై 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా గత మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

సర్ఫీరా (Sarfira Budget) సినిమా నిర్మాణం విషయానికి వస్తే.. స్టార్ హీరో, హీరోయిన్లు, టాప్ టెక్నిషియన్స్‌తో రూపొందించడంతో ఈ మూవీ ఖర్చు కూడా భారీగానే అయింది. టెక్నిషియన్స్, ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్‌తో కలిపి ఈ సినిమా బడ్జెట్ 100 కోట్ల రూపాయలుగా అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఇక ఈ సినిమాకు భారీగా క్రేజ్ కనిపించడంతో ప్రపంచవ్యాప్తంగా 2500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Sarfira Movie 3 Days Collections Worldwide Akshay Kumar Movie picked up in First Weekend

అయితే అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు ఇటీవల ఎక్కువ సంఖ్యలో డిజాస్టర్లు కావడంతో ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా తొలి ఆట నుంచి సూపర్ పాజిటివ్ టాక్ అందుకొన్నది. కానీ కనీస అంచనాలకు తగినట్టుగా కూడా ఈ సినిమా కలెక్షన్లు సాధించలేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

సర్ఫీరా (Sarfira Collections) విషయానికి వస్తే.. ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో రోజు ఈ చిత్రం 4.5 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 7 కోట్ల నికరంగా, 9.5 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Sarfira Movie 3 Days Collections Worldwide Akshay Kumar Movie picked up in First Weekend

ఇక 3వ రోజు ఆదివారం సెలవు దినం కావడంతో ఉత్తరాదిలో ఆక్యుపెన్సీ భారీగానే కనిపించింది. దాంతో కలెక్షన్లు భారీగానే పెరిగాయి. 3వ రోజు ఈ సినిమా 6 కోట్ల రూపాయలు నికర వసూళ్లను రాబడుతుందని అంచనా వేశారు. దాంతో ఇండియాలో ఈ సినిమా 13 కోట్లు నికరంగా, 11 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వివరాల్లోకి వెళితే.. ఓవర్సీస్‌లో ఈ మూవీ 1.5 కోట్లు రాబట్టింది. దాంతో కలిపి ఈ సినిమా 14.5 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. అక్షయ్ కుమార్‌ ముందు భారీ టార్గెట్ ఉందని.. ఆ టార్గెట్ రీచ్ అవుతారా? అనే విషయంపై ట్రేడ్ అనలిస్టులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: sarfira akshay kumar suriya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X