Sarfira 5 Days Collections:15 కోట్ల మూవీ కంటే 150 కోట్ల సినిమా పేలవంగా..డిజాస్టర్ దిశగా అక్షయ్ కుమార్ సర్ఫీరా!

దక్షిణాది స్టార్ హీరో, హీరోయిన్లు సూర్య, జ్యోతిక నిర్మాతలుగా మారి సుధా కొంగర దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా రూపొందించిన సర్ఫీరా చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన ప్రదర్శనను కొనసాగిస్తున్నది. తెలుగు, తమిళంలో భారీ విజయం అందుకొన్న ఆకాశం నీ హద్దురా సినిమాను హిందీలో రీమేక్‌గా మలిచిన ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోతున్నది. దాంతో పేలవంగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో సర్ఫీరా (Sarfira) కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

అతి తక్కువ ధరతో సాధారణ పౌరుడిని విమానం ఎక్కించాలనే కథా నేపథ్యంతో తెరకెక్కిన సర్ఫీరా చిత్రాన్ని సుమారుగా 150 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 2500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ 150 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.

Sarfira Movie 5 Days Collections Worldwide Akshay Kumar Movie picked up in First Weekend

సర్ఫీరా సినిమాకు క్రిటిక్స్ నుంచి బ్రహ్మండమైన రివ్యూలు రావడం, సాధారణ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అయినా ఈ సినిమా సరైన ఓపెనింగ్స్ సాధించలేకపోయింది. తొలి రో జు కేవలం 2.5 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. ఇక రెండో రోజు 100 శాతం వృద్ధి రేటుతో 4.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో రెండు రోజుల్లో 7.5 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక మూడో రోజు సర్ఫీరా చిత్రం 5.5 కోట్లు రాబట్టినప్పటికీ.. అంతగా గ్రోత్ రేట్ కనిపించలేదు. ఇక నాలుగో రోజు కూడా దారుణంగా కలెక్షన్లు పడిపోయాయి. 4వ రోజు కేవలం 1.5 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక ఐదో రోజు 1.5 కోట్లతో సరిపెట్టుకొన్నది. దాంతో ఈ సినిమా 16 కోట్లు రాబట్టింది.

Sarfira Movie 5 Days Collections Worldwide Akshay Kumar Movie picked up in First Weekend

సర్పీరా ఓవర్సీస్‌లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. దాంతో ఈ సినిమా 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 17.5 కోట్ల రూపాయలు వసూలుచేసింది. అయితే కల్కి (Kalki), కిల్ (Kill) చిత్రం నార్త్‌లో భారీగా వసూళ్లు సాధిస్తుండటంతో ఈ సినిమాపై దెబ్బ పడింది.

అయితే బాలీవుడ్‌లో ఇటీవల రిలీజైన కిల్ సినిమా రాబట్టిన కలెక్షన్లను కూడా ఈ మూవీ రాబట్టే పరిస్థితి కనిపించడం లేదు. 15 కోట్ల రూపాయలతో రూపొందిన కిల్ చిత్రం ఇప్పటికే 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ చిన్న సినిమా సాధించిన కలెక్షన్లు కూడా సర్ఫీరా సాధించలేకపోవడం, అక్షయ్ కుమార్ వరుస ఫ్లాపుల వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Read more about: sarfira akshay kumar suriya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X