Adipurush: ప్రభాస్ సినిమాకు కళ్లు చెదిరే ఆఫర్.. బడా సంస్థ చేతికి రైట్స్
కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తెలుగులో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఆరంభంలో టాలీవుడ్ చిత్రాలు మాత్రమే చేసిన అతడు.. 'బాహుబలి' నుంచి పంథాను మార్చుకుని వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలను లైన్‌లో పెట్టుకుని.. ఈ యూనివర్శల్ స్టార్ చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇక, ప్రభాస్ ఇప్పుడు నటిస్తోన్న చిత్రాల్లో పౌరాణిక కథతో వస్తున్న 'ఆదిపురుష్' ఒకటి. ఈ చిత్రం ద్వారానే అతడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
హిందీలో చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఓం రౌత్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. దీని ద్వారా మన స్టార్ హీరో బాలీవుడ్‌లోకి నేరుగా ఎంట్రీ ఇస్తున్నాడు. రామాయణంలో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న కాన్సెప్టును ఇందులో చూపించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. విజువల్ వండర్‌గా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే ముగిసింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

క్రేజీ కాంబినేషన్‌లో విజువల్ వండర్‌గా రాబోతున్న 'ఆదిపురుష్' మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో పోటీ ఏర్పడిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు సంబంధించిన చాలా ఏరియాల హక్కులు అత్యధిక ధరలకు అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ సినిమా ఓవర్సీస్ రైట్స్ (అన్ని భాషలకు కలిపి)ను సరిగమ సినిమాస్ సంస్థ సొంతం చేసుకున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇందుకోసం సదరు సంస్థ చిత్ర యూనిట్ కళ్లు చెదిరే మొత్తాన్ని ముట్టజెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇది ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్ అని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తోన్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు. వీళ్లతో పాటు ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 16న విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











