'సరిలేరు నీకెవ్వరు' 23 రోజుల కలెక్షన్స్: ఇప్పటిదాకా వచ్చిన లాభం ఎంతో తెలుసా..?
సూపర్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' రూపంలో మరో బ్లాక్‌బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొంది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. విడుదలై 23 రోజులు నేటికీ అదే జోరు కంటిన్యూ చేస్తోంది. మరి ఈ 23 రోజుల్లో 'సరిలేరు నీకెవ్వరు' మూవీ రాబట్టిన కలెక్షన్స్ వివరాలు చూద్దామా..

ఈ 23 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా
విడుదలైన మొదటిరోజే బాక్సాఫీస్ దాడి ప్రారంభించిన మహేష్ బాబు.. ఈ 23 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 141.56 కోట్ల షేర్ రాబట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 116.79 కోట్ల షేర్ వసూలు చేసి తన ఫామ్ కొనసాగిస్తూనే ఉన్నారు. 4వ వారంలోనూ థియేటర్స్ వద్ద సందడి కనిపిస్తుండటం విశేషం.

ఏరియావైజ్ రిపోర్ట్.. సరిలేరు నీకెవ్వరు
నైజాం: 39.4 కోట్లు
సీడెడ్: 16.2 కోట్లు
ఉత్తరాంధ్ర: 20.12 కోట్లు
గుంటూరు: 9.78 కోట్లు
ఈస్ట్ గోదావరి: 11.13 కోట్లు
వెస్ట్ గోదావరి: 7.34 కోట్లు
కృష్ణా: 8.74 కోట్లు
నెల్లూరు: 4.08 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి: 116.79 కోట్లు

దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కలెక్షన్స్
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ భేష్ అనిపించుకుంటున్నాయి. ఓవర్సీస్ పరంగా కూడా ఈ మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ROI: 11.97 కోట్లు
ఓవర్సీస్ : 12.8 కోట్లు
వరల్డ్ వైడ్: 141.56 కోట్లు వసూలు చేసింది సరిలేరు నీకెవ్వరు మూవీ.

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ బిజినెస్
నైజాం : 25 కోట్లు
సీడెడ్ : 10.80 కోట్లు
గుంటూరు : 7.20 కోట్లు
ఉత్తరాంధ్ర : 10 కోట్లు
తూర్పు గోదావరి : 7.20 కోట్లు
పశ్చిమ గోదావరి : 6 కోట్లు
కృష్ణ : 6 కోట్లు
నెల్లూరు : 3 కోట్లు
AP/TG మొత్తం : 75.20 కోట్లు
కర్ణాటక 8.30 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.80 కోట్లు
ఓవర్సీస్ 14 కోట్లు
WW మొత్తం: 99.30 కోట్లు

ప్రాఫిట్‌లో సరిలేరు నీకెవ్వరు
100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సరిలేరు నీకెవ్వరు మూవీ ఇప్పటివరకు 41 కోట్ల రూపాయల ప్రాఫిట్ లో ఉంది. ఈ విజయం పట్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆనందంగా ఉన్నారు.

సరిలేరు నీకెవ్వరు.. వివరాలు
ఇక ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్, సంగీత కీలక పాత్రల్లో నటించారు. చిత్రానికి ఘట్టమనేని మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరించారు. దేవి శ్రీ ప్రసాద్ బాణీలు కట్టారు.


Click it and Unblock the Notifications











