సరిలేరు నీకెవ్వరు 27 డేస్ కలెక్షన్స్: 5వ వారంలో ఇదీ పరిస్థితి..
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా విజయవంతంగా 27 రోజులు పూర్తిచేసుకుంది. జనవరి 11న విడుదలై ఇన్ని రోజులు సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగించిన ఈ మూవీ 4వ వారం చివర్లో కాస్త స్లో అయిపోయి 5వ వారంలో అడుగుపెట్టింది. మరి ఈ మూవీ 27 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దామా..

ఈ 27 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా
విడుదలైన మొదటిరోజే బాక్సాఫీస్ దాడి ప్రారంభించిన మహేష్ బాబు.. ఈ 27 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 136.47 కోట్ల షేర్ రాబట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 115.24 కోట్ల షేర్ వసూలు చేసి తన ఫామ్ కొనసాగిస్తూనే ఉన్నారు. 5వ వారంలోనూ అక్కడక్కడా థియేటర్స్ వద్ద సందడి కనిపిస్తుండటం విశేషం.

27వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
27వ రోజు ‘సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రపంచవ్యాప్తంగా 11 లక్షల మేర వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10 లక్షల మేర కలెక్ట్ చేసినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.

ఏరియావైజ్ రిపోర్ట్.. సరిలేరు నీకెవ్వరు
నైజాం: 39.09 కోట్లు
సీడెడ్: 15.46 కోట్లు
ఉత్తరాంధ్ర: 19.57 కోట్లు
గుంటూరు: 9.81 కోట్లు
ఈస్ట్ గోదావరి: 11.21 కోట్లు
వెస్ట్ గోదావరి: 7.37 కోట్లు
కృష్ణా: 8.76 కోట్లు
నెల్లూరు: 3.97 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి: 115.24 కోట్లు

దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కలెక్షన్స్
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ పడిపోయాయి. ఓవర్సీస్ పరంగా కూడా ఈ మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ROI: 11.97 కోట్లు
ఓవర్సీస్ : 11.94 కోట్లు
వరల్డ్ వైడ్: 218.73 కోట్ల గ్రాస్ వసూలు చేసింది సరిలేరు నీకెవ్వరు మూవీ.

ప్రాఫిట్‌లో సరిలేరు నీకెవ్వరు
100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సరిలేరు నీకెవ్వరు మూవీ ఇప్పటికే అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించి మంచి ప్రాఫిట్ లో ఉంది. ఈ విజయం పట్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆనందంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











