‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ నెల పూర్తి.. ఈ 30 రోజుల్లో ఎంత రాబట్టిందో తెలుసా?
Recommended Video
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ సక్సెస్ సాధించింది. జనవరి 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విజయవంతంగా 30 రోజులు పూర్తిచేసుకుంది. మరి ఈ నెల రోజుల్లో ఎంత రాబట్టిందో ఓ లుక్కేద్దామా..

ప్రపంచవ్యాప్తంగా సరిలేరు నీకెవ్వరు హంగామా
తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ‘సరిలేరు నీకెవ్వరు' మూవీ 4వ వారం వచ్చే సరికి కాస్త స్లో అయింది. అయినప్పటికీ డీసెంట్ వసూళ్లు రాబడుతూ 5వ వారంలో ఎంటరైంది. అలా అలా 30 రోజులు ఫినిష్ చేసి ప్రపంచవ్యాప్తంగా 137.36 కోట్లు వసూలు చేసింది.

సరిలేరు నీకెవ్వరు 30 డేస్ ఏరియావైజ్ రిపోర్ట్..
నైజాం: 39.46 కోట్లు
సీడెడ్: 15.52 కోట్లు
ఉత్తరాంధ్ర: 19.73 కోట్లు
గుంటూరు: 9.87 కోట్లు
ఈస్ట్ గోదావరి: 11.27 కోట్లు
వెస్ట్ గోదావరి: 7.41 కోట్లు
కృష్ణా: 8.82 కోట్లు
నెల్లూరు: 4.01 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి: 116.09 కోట్లు

దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కలెక్షన్స్
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ పడిపోయాయి. ఓవర్సీస్ పరంగా కూడా ఈ మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ROI: 8.31 కోట్లు
ఓవర్సీస్ : 11.95 కోట్లు
వరల్డ్ వైడ్: 220.15 కోట్ల గ్రాస్, 137.36 కోట్ల షేర్ వసూలు చేసింది సరిలేరు నీకెవ్వరు మూవీ.

ప్రాఫిట్‌లో సరిలేరు నీకెవ్వరు
అమ్మి ఏరియాల్లో కలిపి 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సరిలేరు నీకెవ్వరు మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి మంచి ప్రాఫిట్ లో ఉంది. ఈ విజయం పట్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మహేష్ బాబు.. సక్సెస్ జోష్ ఎంజాయ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











