Sarileru Neekevvaru 50 days: బాక్సాఫీస్ కుదిపేసిన మహేష్‌బాబు.. ఎంత కొల్లగొట్టారంటే..
టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో 50 రోజుల పోస్టర్ పడిన దాఖలాలు తక్కువే. ఇప్పుడంతా సినిమా హిట్‌కు కలెక్షన్లే బేస్ కావడంతో అర్థశతదినోత్సవం, శతదినోత్సవ పండుగలను ప్రేక్షకులు ఎప్పుడో మరిచిపోయారు. ఇలాంటి రోజుల్లో సరిలేరు నీకెవ్వరు చిత్రం 50 రోజుల పండగను పూర్తి చేసుకొన్నది. అనిల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం గత 50 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..
Recommended Video

సంక్రాంతి నుంచి 50వ రోజు వరకు
సంక్రాంతి బరిలో దూకిన మహేష్ బాబు తన సినిమా సరిలేరు నీకెవ్వరును వసూళ్ల పట్టాలపై పరుగులు పెట్టించారు. సంక్రాంతి సీజన్‌లో భారీ పోటీని ఎదుర్కొని నిలకడగా కలెక్షన్లను సాధించింది. రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 29వ తేదీకి 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు
మహేష్ బాబు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లను నమోదు చేసింది. ఈ చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రూ.225 కోట్లకుపైగా గ్రాస్, రూ.146 కోట్లకుపైగా షేర్ వసూళ్లను రాబట్టింది. దీంతో మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినాను రుజువు చేసింది.

ఏపీ, తెలంగాణలో
తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా సరిలేరు నీకెవ్వరు కలెక్షన్లు ఇలా ఉన్నాయి
నైజాంలో రూ.40.88 కోట్లు
సీడెడ్‌లో రూ.16.5 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.16 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.12 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.8 కోట్లు
గుంటూరులో రూ.11 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.9 కోట్లు
నెల్లూరులో రూ.4.5 కోట్లు వసూలు చేశాయి. దీంతో ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో రూ.121.48 కోట్లు రాబట్టింది.

ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లో
ఇక ఓవర్సీస్‌తోపాటు కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా సరిలేరు నీకెవ్వరు వసూళ్ల హవా కొనసాగింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో రూ.13 కోట్లు రాబట్టగా, తెలుగేతర రాష్ట్రాల్లో రూ.12 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.147 కోట్ల మేర కలెక్షన్లను నమోదు చేసింది.

ప్రీ రిలీజ్ బిజినెస్
సరిలేరు నీకెవ్వరు ప్రి రిలీజ్ బిజినెస్
సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి..
నైజాంలో రూ.25 కోట్లు
సీడెడ్‌లో రూ.11 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.10 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ. 7 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6 కోట్లు
గుంటూరులో రూ.7 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.6 కోట్లు
నెల్లూరులో రూ.3 కోట్లు
కర్ణాటకలో రూ.8 కోట్లు
మిగితా రాష్ట్రాల్లో రూ.2 కోట్లు
ఓవర్సీస్‌లో రూ.14 కోట్లుతో మొత్తంగా రూ.99 కోట్లకుపైగా బిజినెస్ నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ హిట్ కావడానికి కావాల్సిన రూ.100 కోట్లకు బదులుగా రూ.150కోట్ల కలెక్షన్లకు చేరువ కావడంతో డిస్టిబ్యూటర్లలో ఆనందం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











