8 రోజుల్లో 'సరిలేరు నీకెవ్వరు'.. బాక్సాఫీస్ షేక్.. బొమ్మ దద్దరిల్లింది
సూపర్‌స్టార్ మహేష్ బాబు 26వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ జోష్ కొనసాగుతూనే ఉంది. క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. మహేష్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతోంది. జనవరి 11న విడుదలైన ఈ సినిమా తొలి 8 రోజుల్లో ఎంత రాబట్టిందో వివరంగా చూద్దామా..

మహేష్ కెరీర్‌లో ది బెస్ట్ 'సరిలేరు నీకెవ్వరు'
సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకుంటున్నాడు మహేష్ బాబు. మహేష్ కెరీర్‌లో ఈ సినిమా ది బెస్ట్ అని ఇప్పటికే నిరూపించుకుంది. చిత్రంలో మహేష్ బాబు నటన, అనిల్ రావిపూడి టేకింగ్, కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

8 రోజుల్లో మొత్తం షేర్..
ఈ నేపథ్యంలో సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తూ విడుదలైన వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది 'సరిలేరు నీకెవ్వరు' మూవీ. సంక్రాంతి సెలవులు, ఎక్స్ట్రా షోస్ ఈ కలెక్షన్స్‌లో కీలకపాత్ర పోషించాయి. దీంతో 8 రోజుల్లో మొత్తంగా 112.03 కోట్ల షేర్ రాబట్టింది ఈ సినిమా.

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు.. ఏరియావైస్ రిపోర్ట్
'సరిలేరు నీకెవ్వరు' మూవీకి గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఈ 8 రోజుల్లో నైజాంలో 29.8 కోట్లు, సీడెడ్ 13.25 కోట్లు, ఉత్తరాంధ్ర 14.9 కోట్లు, ఈస్ట్ గోదావరి 9.04 కోట్లు, వెస్ట్ గోదావరి 6.02 కోట్లు, గుంటూరు 8.51 కోట్లు, కృష్ణా 7.34 కోట్లు, నెల్లూరు 3.32 కోట్లు వసూలయ్యాయి.

ఇతర రాష్ట్రాల్లో చూస్తే..
ఇక సరిలేరు నీకెవ్వరు రెస్ట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చూస్తే.. కర్ణాటక రాష్ట్రంలో 7 కోట్లు, తమిళనాడు 1 కోటి, రెస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలన్నీ కలిపి 1.5 కోట్లు, యూఎస్‌ఏ 7.85 కోట్లు రాబట్టి మొత్తంగా 112.03 కోట్ల షేర్ వసూలు చేసింది సరిలేరు నీకెవ్వరు మూవీ.

బిగ్గెస్ట్ హిట్ దిశగా మహేష్ పరుగులు
మహేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించే దిశగా 'సరిలేరు నీకెవ్వరు' పరుగులు తీస్తోంది. దిల్‌రాజు సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న నటించింది. విజయశాంతి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











