Just In
- 3 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 5 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 6 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సరిలేరు నీకెవ్వరు 5వ రోజు వసూళ్లు: పండగ టైమ్.. మహేష్ బాబు వసూళ్లు ఎలా ఉన్నాయంటే!
సూపర్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతి సక్సెస్ అందుకున్నారు. తన 26వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' ద్వారా సంక్రాంతి రేస్‌లో నిలిచి క్లాస్, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో 'సరిలేరు నీకెవ్వరు' మూవీ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా తొలి 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దామా..

ఫస్ట్ డే టాక్.. 100 కోట్ల మార్క్
మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 'సరిలేరు నీకెవ్వరు' మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత అదే జోష్ కంటిన్యూ చేస్తూ 3 రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా 103 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది.

ఐదో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో..
మూడు రోజుల పాటు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో ప్రదర్శించబడిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ నాలుగో రోజూ చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబట్టింది. ఇక 5వ రోజుకు వచ్చేసరికి సంక్రాంతి సెలవు కలసి వచ్చింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఐదో రోజు ఈ సినిమా 8.5 నుంచి 10 కోట్ల రూపాయలు వసూలు చేసిందని రిపోర్ట్స్ అందాయి.

ప్రపంచవ్యాప్తంగా ఫిఫ్త్ డే..
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లో మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఐదో రోజు ఈ సినిమా 9 నుంచి 12 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఓ రకంగా ఇది బెస్ట్ రిపోర్ట్ అని చెప్పుకోవచ్చు.

మొదటి ఐదు రోజుల్లో టోటల్ షేర్..
ఇక మొదటి ఐదు రోజుల్లో టోటల్ షేర్ చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 66.5 నుంచి 68 కోట్లుగా ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూస్తే 81.5 నుంచి 84 కోట్లు అని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే ప్రస్తుతానికి మహేష్ మానియా కనిపిస్తోంది.

ఈ వారం ముగిస్తే పరిస్థితి
స్పెషల్ షోస్ అనుమతి పైగా సంక్రాంతి సెలవులు యాడ్ కావడంతో మొదటి ఐదు రోజులు మంచి కలెక్షన్సే రాబట్టాయి. ఈ జోష్ ఈ ఆదివారం వరకు కనిపించే అవకాశం ఉంది. ఆ తర్వాత కలెక్షన్స్ కొంతమేర డ్రాప్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. తమన్నా ఐటెం సాంగ్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.