వసూళ్లలో కింగ్.. విదేశాల్లోనూ 'సరిలేరు నీకెవ్వరు': సంక్రాంతి మొగుడు

సంక్రాంతికి మొదలెట్టిన బాక్సాఫీస్ దాడి నేటికీ కొనసాగిస్తూనే ఉన్నారు సూపర్‌స్టార్ మహేష్ బాబు. తన 26వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' ద్వారా భారీ వసూళ్లను రాబడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు రికార్డులను తిరగరాస్తూ సంక్రాంతి మొగుడు అనిపించుకున్న ఈ సినిమా విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. ఈ మేరకు సరికొత్త ఫీట్ అధిగమించింది. ఆ వివరాలు చూద్దామా..

ఓవర్సీస్ పబ్లిక్.. మహేష్ డిమాండ్

ఓవర్సీస్ పబ్లిక్.. మహేష్ డిమాండ్

సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్‌లో మాంచి డిమాండ్ ఉంటుంది. అందుకే మహేష్ ప్రతీ సినిమాను ఓవర్సీస్‌లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తారు. ఈ బాటలోనే భారీ అంచనాలు నడుమ ఓవర్సీస్ మార్కెట్‌లో విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ అక్కడ కూడా సంక్రాంతి మొగుడు అనిపించుకుంది.

ఆ మార్క్ అధిగమించిన మూడో సినిమాగా..

ఆ మార్క్ అధిగమించిన మూడో సినిమాగా..

విదేశాల్లో జోరుమీదున్న'సరిలేరు నీకెవ్వరు' మూవీ ఓ అరుదైన మార్క్ చేరుకుంది. 2 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ అధిగమించి ఆ జోరు కంటిన్యూ చేస్తోంది. నిన్నటికి ఈ సినిమా 2 .1 మిలియన్ డాలర్స్ వసూళ్లు రాబట్టింది. అంతేకాదు మహేష్ కెరీర్‌లో 2 మిలియన్ డాలర్స్ మార్క్ అందుకున్న మూడో సినిమాగా తన పేరును లిఖించుకుంది.

గతంలో ఆ రెండు సినిమాలు.. ఫ్యాన్స్ సంబరాలు

గతంలో ఆ రెండు సినిమాలు.. ఫ్యాన్స్ సంబరాలు

గతంలో విదేశాల్లో సూపర్ పర్ఫార్మ్ చేసి మాంచి వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాలు కూడా 2 మిలియన్ డాలర్స్+ కలెక్షన్స్ వసూలు చేశాయి. ఇప్పుడు అదే ఫీట్ 'సరిలేరు నీకెవ్వరు' మూవీ కూడా అధిగమించడంతో మహేష్ కెరీర్‌లో 2 మిలియన్ డాలర్ మార్క్ దాటిన సినిమాలు 3 అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

సంక్రాంతి సీజన్.. పోటాపోటీ

సంక్రాంతి సీజన్.. పోటాపోటీ

గతంలో పోల్చితే ఈ సంక్రాంతి సీజన్ మరింత పోటాపోటీగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఎక్కువ సినిమాలు లేనప్పటికీ ''సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో'' కేవలం ఈ రెండు సినిమాలే రసవత్తర పోటీ కనబరుస్తూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో ఈ రెండు సినిమాల హంగామా కనిపిస్తోంది.

మ‌హేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్

మ‌హేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్

మ‌హేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించే దిశ‌గా 'స‌రిలేరు నీకెవ్వ‌రు' ప‌రుగులు తీస్తోంది. దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ కమ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను నిర్మించారు. చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న నటించింది. విజయశాంతి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X