'సరిలేరు నీకెవ్వరు' రెండో రోజు రిపోర్ట్.. మహేష్ బీభత్సం.. పరిస్థితి ఎలా ఉందంటే!

సంక్రాంతి రేస్‌లో మహేష్ బాబు మేనియా కనిపిస్తోంది. మూడు రోజులు ముందుగానే తెలుగు ప్రేక్షకులకు పండగ తీసుకొచ్చారు ఈ సూపర్ స్టార్. తన 26వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు'తో అన్ని వర్గాల ప్రేక్షకులను హూషారెత్తించారు. జనవరి 11న విడుదలైన ఈ సినిమా తొలిరోజే హిట్ టాక్ తెచ్చుకొని అదే జోష్ రెండో రోజూ కంటిన్యూ చేసింది. వివరాల్లోకి పోతే..

నువ్వా నేనా! పోటా పోటీగా వసూళ్లు.. ఆసక్తికర వాతావరణం

నువ్వా నేనా! పోటా పోటీగా వసూళ్లు.. ఆసక్తికర వాతావరణం


మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న విడుదలై జోరు కొనసాగిస్తుండగా, జనవరి 12న అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమా విడుదలై అన్ని సెంటర్లలో సందడి చేసింది. దీంతో ఈ రెండు సినిమాలు నువ్వా నేనా! అంటూ పోటా పోటీగా వసూళ్లు రాబట్టాయి. సగటు అభిమాని ఈ రెండు సినిమాలపై ఒకే విధంగా రియాక్ట్ అవుతున్నాడు. దీంతో అన్ని థియేటర్స్ వద్ద ఆసక్తికర వాతావరణం నెలకొంది.

మహేష్ బాబు బీభత్సం..

మహేష్ బాబు బీభత్సం..

తొలిరోజే సూపర్ డూపర్ హిట్ టాక్ రావడంతో రెండో రోజు కూడా అదే జోష్ కొనసాగించింది 'సరిలేరు నీకెవ్వరు' మూవీ. 95 % ఆక్యుపెన్సీతో మహేష్ బాబు బీభత్సం సృష్టించారు. దీంతో రెండోరోజు కూడా ఈ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ అందుకున్నట్లు ప్రాథమిక రిపోర్ట్స్ చెబుతున్నాయి.

ఫస్ట్ డేతో పోల్చితే..

ఫస్ట్ డేతో పోల్చితే..

థియేటర్ల సంఖ్య తగ్గడం, మరోవైపు 'అల.. వైకుంఠపురములో' సినిమా విడుదల కావడం లాంటి కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డేతో పోల్చితే 'సరిలేరు నీకెవ్వరు' రెండోరోజు వసూళ్లు కాస్త తగ్గాయి. సెకండ్ డే 9 కోట్ల రేంజ్‌లో కలెక్షన్స్ ఉండవచ్చని తెలుస్తోంది. ఆఫ్‌లైన్ టికెట్ సేల్స్ వివరాలు కూడా తెలిస్తే అది 10 కోట్లుగా ఉండొచ్చని టాక్.

సంక్రాంతి వచ్చింది.. ఇక సందడే సందడి

సంక్రాంతి వచ్చింది.. ఇక సందడే సందడి

ఇక మూడోరోజు నుండి సంక్రాంతి సెలవులు వచ్చేస్తున్నాయి కాబట్టి 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్స్ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. స్పెషల్ షోస్ పర్మిషన్ కూడా ఉంది కాబట్టి వారం రోజులపాటు ఈ సినిమా కుమ్మేయడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తానికైతే ఈ సినిమా నిర్మాతలు మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర సక్సెస్ జోష్‌లో ఉన్నారు.

Recommended Video

Sarileru Neekevvaru Movie Twitter Review
ఆనందంలో చిత్రయూనిట్‌.. గ్రాండ్ సెలబ్రేషన్స్

ఆనందంలో చిత్రయూనిట్‌.. గ్రాండ్ సెలబ్రేషన్స్

సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ రిపోర్ట్స్ చూసిన చిత్రయూనిట్ బ్లాక్‌బస్టర్ పార్టీ చేసుకుంది. ఈ మేరకు ఆ ఫోటో షేర్ చేస్తూ ''సెలబ్రేషన్స్ మొదలయ్యాయి'' అని పేర్కొన్నారు మహేష్ బాబు. ఈ పార్టీలో చిత్రయూనిట్‌తో అంతా పాల్గొంది. ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక నటించగా, విజయశాంతి కీలకపాత్ర పోషించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X