'సరిలేరు నీకెవ్వరు' అఫీషియల్ కలెక్షన్స్: బాక్సాఫీస్ దద్దరిల్లింది.. రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్
భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ తొలిరోజే సూపర్ సక్సెస్ అని నిరూపించుకుంది. క్లాస్, మాస్ అనే తేడాలేకుండా అన్ని ఏరియాల్లో ఓ రేంజ్ వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్ రిపోర్ట్ తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. వివరాల్లోకి పోతే..

కుమ్మేసిన మహేష్ బాబు.. సరిలేరు నిపించుకుంటూ
గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో తన అభినయం, డాన్స్‌తో ఆకట్టుకున్నారు మహేష్ బాబు. ఆయన డైలాగ్ డెలివరీ, హీరోయిన్ రష్మికతో రొమాన్స్ సూపర్ స్టార్ అభిమానులకు సూపర్ కిక్ ఇచ్చాయి. దీంతో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ రాబట్టి సరిలేరు తనకెవ్వరు అని నిరూపించారు మహేష్.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి..
'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో థియేటర్స్ దద్దరిల్లాయి. ''బొమ్మ దద్దరిల్లిపోయింది'' అనే టాక్ బయటకొచ్చింది. దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కొత్త సంవత్సరానికి కిక్ స్టార్ట్ ఇస్తూ తొలిరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా 32.77 కోట్లు కొల్లగొట్టారు మహేష్ బాబు.

ఎక్కడెక్కడ ఎంతెంత? ఏరియావైజ్ రిపోర్ట్ చూస్తే..
నైజాంలో 8.66 కోట్లు, సీడెడ్‌లో 4.15 కోట్లు, ఉత్తరాంధ్రలో 4.4 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 3.35 కోట్లు, వెస్ట్ గోదావరిలో 2.72 కోట్లు, గుంటూరులో 5.15 కోట్లు, కృష్ణాలో 3.07 కోట్లు, నెల్లూరులో 1.27 కోట్లు వసూలు చేసింది 'సరిలేరు నీకెవ్వరు' సినిమా. మొత్తంగా చూస్తే 32.77 కోట్లు కలెక్ట్ అయింది.

బ్లాక్‌బస్టర్‌కి బాబు వచ్చాడు.. యూనిట్ హ్యాపీ
''ప్రతీ సంక్రాంతికి బ్లాక్‌బస్టర్‌లు వచ్చేవి.. ఈ సారి బ్లాక్‌బస్టర్‌కి బాబు వచ్చాడు'' అని పేర్కొంటూ 'సరిలేరు నీకెవ్వరు' సత్తాను ప్రేక్షకులకు తెలియజేసింది చిత్రయూనిట్. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకొని టీమ్ అంతా కలిసి సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో చూస్తే..
నైజాంలో 26 కోట్లు, సీడెడ్ 12 కోట్లు, ఉత్తరాంధ్ర 10 కోట్లు, ఈస్ట్ గోదావరి 7.5 కోట్లు, వెస్ట్ గోదావరి 6 కోట్లు, గుంటూరు 7.3 కోట్లు, కృష్ణా 6 కోట్లు, నెల్లూరు 3.1 కోట్లు.. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 77.9 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఫస్ట్ డేనే ఇలా ఉందంటే ఇక సంక్రాంతి సీజన్
ఈ లెక్కన చూస్తే తొలిరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం రికవరీ సాధించింది 'సరిలేరు నీకెవ్వరు' మూవీ. ఫస్ట్ డేనే ఇలా ఉందంటే ఇక సంక్రాంతి సీజన్ ముగిసే సరికి ఆ వసూళ్ల సునామీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా!!. మొత్తానికి మరోసారి రికార్డులు తిరగ రాయబోతున్నారన్నమాట మహేష్.
మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. తమన్నా ఐటెం సాంగ్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











