twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    11 days box office collections: జోరుమీదున్న సరిలేరు.. పదకొండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

    |

    సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు వసూళ్ల పరంపరను రెండోవారంలో కూడా కొనసాగిస్తోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రదేశాల్లో నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిందని రిపోర్ట్స్ అందాయి. ఇక సంక్రాంతి బరిలో వచ్చిన అల వైకుంఠపురంతో కలిసి పోటాపోటీగా వసూళ్లను సాధిస్తూ రెండో వారంలోనూ ఏ మాత్రం జోరు తగ్గకుండా దూసుకుపోతోంది.. గత 11 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

     11వ రోజున కలెక్షన్లు

    11వ రోజున కలెక్షన్లు

    ఇక 11వ రోజున ఏపీ, తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
    నైజాంలో రూ.64లక్షలు
    సీడెడ్‌లో రూ. 21 లక్షలు
    ఉత్తరాంధ్రలో రూ. 55 లక్షలు
    తూర్పు గోదావరి జిల్లాలో రూ. 24.7లక్షలు
    పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 14.4 లక్షలు
    గుంటూరులో రూ. 9.5 లక్షలు
    కృష్ణా జిల్లాలో రూ.12 లక్షలు
    నెల్లూరులో రూ.7.3 లక్షలు వసూలు చేసింది.

     మొత్తం 11 రోజుల్లో

    మొత్తం 11 రోజుల్లో

    గత 11 రోజుల్లో సరిలేరు నీకెవ్వరు సాధించిన మొత్తం
    నైజాంలో రూ.33.56 కోట్లు
    సీడెడ్‌లో రూ.14.31 కోట్లు
    ఉత్తరాంధ్రలో రూ.17.31 కోట్లు
    తూర్పు గోదావరి జిల్లాలో రూ.10.31 కోట్లు
    పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6.71 కోట్లు
    గుంటూరులో రూ.9.14 కోట్లు
    కృష్ణా జిల్లాలో రూ.8.09 కోట్లు
    నెల్లూరులో రూ.3.59 కోట్లు వసూలు చేశాయి.

    ప్రపంచవ్యాప్తంగా రూ. 123 కోట్ల షేర్

    ప్రపంచవ్యాప్తంగా రూ. 123 కోట్ల షేర్

    సరిలేరు నీకెవ్వరు చిత్రం 11వ రోజున భారీ వసూళ్లు సాధించడంతో రికార్డు వసూళ్లు నమోదయ్యాయి. ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో రూ.2.08 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా రూ.2.37 కోట్ల షేర్‌ను నమోదు చేసుకొంది. దీంతో ఈ చిత్రం 11 రోజుల్లో మొత్తంగా ఏపీ తెలంగాణలో రూ.103 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా రూ.123 కోట్ల షేర్‌ను రాబట్టింది.

    ఓవర్సీస్‌లో వసూళ్లు

    ఓవర్సీస్‌లో వసూళ్లు

    ఇక ఏపీ, తెలంగాణేతర రాష్ట్రాల్లో కూడా సరిలేరు నీకెవ్వరు సత్తా చాటుతున్నది. కర్ణాటకలో రూ.7.06 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.1.75 కోట్లు, ఓవర్సీస్‌లో 11.26 కోట్లు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా 123.09 కోట్ల షేర్, 197 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టడం ఓ రికార్డుగా ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

     సరిలేరు నీకెవ్వరు ప్రి రిలీజ్ బిజినెస్

    సరిలేరు నీకెవ్వరు ప్రి రిలీజ్ బిజినెస్

    సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి..
    నైజాంలో రూ.25 కోట్లు
    సీడెడ్‌లో రూ.11 కోట్లు
    ఉత్తరాంధ్రలో రూ.10 కోట్లు
    తూర్పు గోదావరి జిల్లాలో రూ. 7 కోట్లు
    పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6 కోట్లు
    గుంటూరులో రూ.7 కోట్లు
    కృష్ణా జిల్లాలో రూ.6 కోట్లు
    నెల్లూరులో రూ.3 కోట్లు
    కర్ణాటకలో రూ.8 కోట్లు
    మిగితా రాష్ట్రాల్లో రూ.2 కోట్లు
    ఓవర్సీస్‌లో రూ.14 కోట్లుతో మొత్తంగా రూ.99 కోట్లకుపైగా బిజినెస్ నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ హిట్ కావడానికి కావాల్సిన రూ.100 కోట్లను కలెక్షన్లు సులభంగా దాటడంతో డిస్టిబ్యూటర్లలో ఆనందం వ్యక్తమవుతోంది.

    English summary
    Super Star Mahesh Babu latest movie Sarileru Neekevvaru going good at box office. It may cross break even this weekend world wide. It collected 123 crores share worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X