సరిలేరు నీకెవ్వరు: మహేష్ కలెక్షన్ల సునామీ.. 3 రోజుల్లోనే ఎంత రాబట్టిందో తెలుసా? మరో రికార్డ్

జనవరి 11న మొదలైన 'సరిలేరు నీకెవ్వరు' బాక్సాఫీస్ దాడి కొనసాగుతూనే ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి స్పెషల్ ట్రీట్ ఇస్తూ ఇటు ప్రేక్షక లోకాన్ని అటు చిత్రయూనిట్ సభ్యులను ఆనందపెట్టారు. మొదటి రోజే సూపర్ సక్సెస్ అనే టాక్ తెచ్చుకున్న 'సరిలేరు నీకెవ్వరు' మూవీ మూడో రోజు ముగిసేసరికి ఓ ఫీట్ అధిగమించింది. ఇంతకీ ఆ ఫీట్ ఏంటి? వివరాల్లోకి పోతే..

ముందే హింట్ ఇచ్చిన మహేష్.. ఇప్పుడు!

ముందే హింట్ ఇచ్చిన మహేష్.. ఇప్పుడు!

''ప్రతీ సంక్రాంతికి అల్లుడొస్తాడు.. కానీ సంక్రాంతికి మొగుడొస్తున్నాడు'' అని సరిలేరు నీకెవ్వరు విడుదలకు ముందే హింట్ ఇచ్చిన మహేష్ బాబు.. దాన్ని నిరూపించి చూపించారు. ప్రీమియర్స్ ద్వారానే బాక్సాఫీస్ దాడి షురూ చేశారు. సంక్రాంతి సందడి చేస్తూ భారీ వసూళ్లు రాబడుతున్నారు.

మూడో రోజు కూడా అదే ఫామ్.. తగ్గేదే లేదు

మూడో రోజు కూడా అదే ఫామ్.. తగ్గేదే లేదు

క్లాస్, మాస్ సెంటర్స్ అనే తేడాలేకుండా అన్నిచోట్లా మహేష్ మానియా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో సరిలేరు నీకెవ్వరు సినిమా జోరుమీదుంది. 95% ఆక్యుపెన్సీతో మహేష్ బాబు బీభత్సం సృష్టిస్తున్నారు. మొదటి రెండు రోజులు కుమ్మేసిన మహేష్.. మూడో రోజు కూడా అదే ఫామ్ కొనసాగించారు.

100 కోట్ల మార్క్.. మరో రికార్డ్

100 కోట్ల మార్క్.. మరో రికార్డ్

దీంతో మూడు రోజు ముగిసేసరికి 'సరిలేరు నీకెవ్వరు' మూవీ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ చెబుతున్నాయి. మూడో రోజే ఈ ఫీట్ సాధించడం పట్ల మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహేష్ కెరీర్‌లో 100 కోట్ల మార్క్ దాటినా 6వ సినిమాగా 'సరిలేరు నీకెవ్వరు' మూవీ రికార్డు నమోదు చేసింది.

 సంక్రాంతి సెలవులు.. ప్రభుత్వ ప్రోత్సాహం

సంక్రాంతి సెలవులు.. ప్రభుత్వ ప్రోత్సాహం

ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇచ్చాయి. సంక్రాంతి ముగిసేదాకా రోజు 6 షోస్ వేసుకునేలా స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చాయి. కాబట్టి మరో రెండు మూడు రోజుల్లో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా బాక్సాఫీస్ దాడి మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

'సరిలేరు నీకెవ్వరు' మహేష్..

'సరిలేరు నీకెవ్వరు' మహేష్..

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. తమన్నా ఐటెం సాంగ్ చేసింది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ఈ చిత్ర నిర్మాణంలో మహేష్ బాబు కూడా భాగం కావడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X