నాలుగో రోజూ కుమ్మేసిన మహేష్.. 'సరిలేరు నీకెవ్వరు' వసూళ్ల ప్రవాహం.. బ్లాక్‌బస్టర్‌కా బాప్

'సరిలేరు నీకెవ్వరు' వసూళ్ల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. క్లాస్, మాస్ సెంటర్స్ అన్నింటిలో మహేష్ బాబు సత్తా చాటుతున్నారు. ఈ సంక్రాంతికి స్పెషల్ ట్రీట్ ఇస్తూ సరికొత్త కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. జనవరి 11న విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ నాలుగో రోజూ కుమ్మేసింది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ ఎంత వచ్చాయి? ఆ రిపోర్ట్ ఏంటి? ఓ లుక్కేద్దామా..

 తొలి రోజు నుంచే మహేష్ దాడి.. 3 రోజుల్లోనే

తొలి రోజు నుంచే మహేష్ దాడి.. 3 రోజుల్లోనే

మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టింది 'సరిలేరు నీకెవ్వరు' మూవీ. అదే జోష్ కంటిన్యూ చేస్తూ 3 రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం 103 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ మేరకు చిత్రయూనిట్ అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

నాలుగో రోజూ సత్తా చాటుతూ

నాలుగో రోజూ సత్తా చాటుతూ

తొలి మూడు రోజులు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో ప్రదర్శించబడిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ నాలుగో రోజూ సత్తా చాటింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నాలుగో రోజు 7 నుంచి 10 కోట్ల రూపాయలు వసూలైనట్లు రిపోర్ట్స్ అందాయి. ఓ రకంగా చూస్తే ఇవి బెస్ట్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే నాలుగో రోజు..

ప్రపంచవ్యాప్తంగా చూస్తే నాలుగో రోజు..

కేవలం తెలుగు రాష్ట్రాల జనమే గాక, ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల జనం కూడా మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు నీరాజనం పలుకుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే నాలుగో రోజు ఈ సినిమా 8 నుంచి 12 కోట్లు రాబట్టినట్లు తెలిసింది.

నాలుగు రోజుల్లో టోటల్ షేర్.. మహేష్ మానియా

నాలుగు రోజుల్లో టోటల్ షేర్.. మహేష్ మానియా

ఇక మొదటి నాలుగు రోజుల్లో టోటల్ షేర్ చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 56 నుంచి 59 కోట్లుగా ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూస్తే 73 నుంచి 77 కోట్లు అని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే మహేష్ మానియా కనిపిస్తోంది.

బ్లాక్‌బస్టర్‌కా బాప్.. సంక్రాంతి మొగుడు

బ్లాక్‌బస్టర్‌కా బాప్.. సంక్రాంతి మొగుడు

ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌కా బాప్ అనిపించుకున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఈ వారాంతం కల్లా భారీ వసూళ్లు రాబట్టడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. సంక్రాంతి సెలవులు కావడం చిత్రానికి బాగా కలిసొచ్చిన అంశం అంటున్నారు. ఏదేమైనా ''ఈ సంక్రాంతి మొగుడు'' అని నిరూపించుకున్నారు మహేష్.

దిల్ రాజు, అనిల్ సుంకర.. మహేష్ బాబు భాగం

దిల్ రాజు, అనిల్ సుంకర.. మహేష్ బాబు భాగం

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. తమన్నా ఐటెం సాంగ్ చేసింది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి ఈ చిత్ర నిర్మాణంలో మహేష్ బాబు కూడా భాగమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X