సరిలేరు నీకెవ్వరు 6 days collections: ఓవరాల్ బాక్సాఫీస్ పరిస్థితి ఇది..

సూపర్‌స్టార్ మహేష్, క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం పండగ సీజన్‌ను ఫుల్లుగా క్యాష్ చేసుకొంటున్నది. అల వైకుంఠపురం చిత్రం నుంచి ఎదురైన పోటీని తట్టుకొని భారీగానే కలెక్షన్లు సాధిస్తున్నది. గత 6 రోజుల పరిస్థితిని చూస్తే కొంత మేరకు తగ్గినప్పటికి నిలకడగానే కలెక్షన్లను సాధిస్తూ దూసుకెళ్తున్నది. వివరాల్లోకి వెళితే..

6వ రోజు బాక్సాఫీస్ పరిస్థితి

6వ రోజు బాక్సాఫీస్ పరిస్థితి


జనవరి 11న రిలీజైన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఐదో రోజున వసూళ్లు కొంత మేరకు తగ్గాయి. కాకపోతే ఆరో రోజు మాత్రం కొంత పాజిటివ్ కనిపిచడంతో సినిమా మరిన్నీ కలెక్షన్లు రాబడుతుందనే అభిప్రాయానికి ట్రేడ్ వర్గాలు వచ్చాయి. ఆరో రోజున ఓవరాల్‌గా కొన్ని సెంటర్లలో 60 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా, మరికొన్ని ప్రాంతాల్లో 80 శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపించింది.

కాకినాడలో కుమ్మేస్తున్న మహేష్‌బాబు

కాకినాడలో కుమ్మేస్తున్న మహేష్‌బాబు

ఏపీలో కాకినాడలో
మొదటి రోజు : 47,16,874
రెండో రోజు : 22,93,330
మూడో రోజు : 13,52,658
నాలుగో రోజు : 17,25,034
ఐదో రోజు : 19,59,624
ఆరో రోజు : 20,54,624
మొత్తం ఆరో రోజుల షేర : 1,41,02,624‌గా నమోదైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలో

పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలో

పశ్చిమ గోదావరి జిల్లాలో సరిలేరు నీకెవ్వరు మంచి జోష్‌తో వసూళ్లు సాధిస్తున్నది. ఆరో రోజున రూ.52 లక్షల షేర్ సాధించింది. గత ఆరో రోజుల్లో రూ.5.06 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇది ఆల్ టైమ్ రికార్డుగా చెప్పుకొంటున్నారు. గుంటూరులో ఈ చిత్రం ఇప్పటికే రూ.7.60 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

నైజాంలో భారీగా

నైజాంలో భారీగా

నైజాంలో సరిలేరు నీకెవ్వరు చిత్రానికి మంచి ఆదరణ లభిస్తున్నది. 6వ రోజున నైజాంలో ఈ చిత్రం రూ.3.14 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తం ఆరు రోజుల్లో ఈ చిత్రం రూ.25.49 కోట్లు కలెక్ట్ చేసింది. నైజాంలో 25 కోట్లు వసూలు చేసిన నాన్ బాహుబలి సినిమాల సరసన చేరింది.

ఏపీలో ప్రాంతాల వారీగా

ఏపీలో ప్రాంతాల వారీగా

ఏపీలో విషయానికి వస్తే

సీడెడ్‌లో రూ.3.14 కోట్లు

ఉత్తరాంధ్రలో రూ.1.75 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.72 లక్షలు
గుంటూరులో రూ.53 లక్షలు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.01 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలోరూ.52 లక్షలు
నెల్లూరులో రూ.31 లక్షలు వసూలు చేసింది.

ఏపీ, తెలంగాణలో కలిపి

ఏపీ, తెలంగాణలో కలిపి

ఇలా ఏపీ, తెలంగాణలో మొత్తం కలిపి 6 రోజున సరిలేరు నీకెవ్వరు చిత్రం రూ.8.5 కోట్లు వసూలు చేసినట్టు ప్రాథమిక సమాచారం. అయితే ఈ వసూళ్లు హెచ్చు తగ్గులుగా వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 6వ రోజు ఈ చిత్రం రూ.9.5 కోట్లు వసూలు చేసింది.

Recommended Video

Mahesh Babu Emotional Speech At Sarileru Neekevvaru Success Meet
లాభం రావాలంటే ఎంత వసూలు చేయాలంటే..

లాభం రావాలంటే ఎంత వసూలు చేయాలంటే..


ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా జరిగింది..
నైజాంలో రూ.25 కోట్లు
సీడెడ్‌లో రూ.10.80 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.10 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.7.20 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6 కోట్లు
గుంటూరులో రూ.7.20 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.6 కోట్లు
నెల్లూరులో రూ. 3 కోట్లు
ఏపీ, తెలంగాణలో మొత్తం కలిపి రూ.75 కోట్లకుపైగా
కర్ణాటకలో రూ.8.30 కోట్లు
మిగితా రాష్ట్రాల్లో రూ.1.85 కోట్లు
ఓవర్సీస్ హక్కులు రూ.14 కోట్లకు కలిపి మొత్తంగా ఈ చిత్రం రూ.99.50 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే కనీసం రూ.100 కోట్ల షేర్ సాధించాల్సి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X