Just In
- 3 min ago
జాతిరత్నాలు మైండ్ బ్లోయింగ్ బిజినెస్.. నిన్న ప్రభాస్ ఇప్పుడు మరో హీరో.. షాకిచ్చేలా ఉన్నారు!
- 30 min ago
అన్ని భాషల్లోకి వెళ్లనున్న ప్లే బ్యాక్.. రియల్ సక్సెస్ అంటే ఇదే!
- 47 min ago
తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి: లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రీదేవి కూతురు
- 1 hr ago
బెడ్‌కే పరిమితమైన నిహారిక.. ఆ గాయం అవ్వడంతో చైతన్య సేవలు
Don't Miss!
- Finance
దిగొస్తోన్న సోనా.. ఆగస్ట్‌లో 50 వేల పైచిలుకు.. మార్చిలో 43 వేలు
- News
దీదీకి షాక్ .. బెంగాల్ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన టీఎంసీ మాజీ ఎంపి దినేష్ త్రివేది
- Sports
India vs England: వణికిస్తున్న అశ్విన్, అక్షర్.. పెవిలియన్‌కు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్!
- Automobiles
కార్లలో ఇకపై ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ కూడా తప్పనిసరి: కేంద్రం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Sarileru Neekevvaru Day 7 collections: మహేష్ రికార్డుల పరంపర.. వరుసగా 100 కోట్ల ప్రభంజనం
సూపర్‌స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్నాడు. క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సరికొత్త కలెక్షన్లతో రికార్డులు తిరగరాస్తున్నది. ఈ చిత్రం మహేష్ కెరీర్‌లోనే ఎన్నడూ లేని విధంగా కలెక్షన్లు నమోదు చేస్తున్నది. తాజాగా ఈ చిత్రం అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంబంధించి గత 7 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..

ఏడో రోజున రూ.100 కోట్ల షేర్
సూపర్‌స్టార్ మహేష్ తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకొన్నారు. ఆయన నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. ఏడు రోజుల్లోనే వంద కోట్ల షేర్ సాధించడం గమనార్హం. తొలివారం గడిచిన తర్వాత కూడా సరిలేరు నీకెవ్వరు చిత్రం నిలకడగా వసూళ్లు సాధించడం గమనార్హం.

మహేష్ వరుసగా మూడోసారి
మహేష్ బాబు వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఇది మూడోసారి. వరుసగా రెండుసార్లు తన చిత్రాన్ని ఈ క్లబ్‌లో చేర్చిన ఘనతను మహేష్ బాబు సొంతం చేసుకొన్నారు. గతంలో మహర్షి, భరత్ అనే నేను చిత్రాలు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం, రిలీజైన ఏడో రోజున రూ.100 కోట్ల షేర్ మైలురాయిని దాటింది.

ఏపీ సెంటర్లలో
ఇక ఏపీలో తూర్పు గోదావరి జిల్లాలో 7వ రోజున కూడా సరిలేరు నీకెవ్వరు చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది. ఏడో రోజున ఈ చిత్రం రూ.95,66,105 షేర్‌ను నమోదు చేసింది. ఇక మొత్తంగా 7 రోజుల్లో రూ. 8.18 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక కాకినాడలో ఏడో రోజున రూ. 20,12,410, మొత్తంగా ఏడు రోజుల్లో రూ. 1,61,15,034 వసూలు చేసింది. ఇక అనకాపల్లిలో ఏడో రోజున రూ.7,40,348, మొత్తంగా రూ. 58,97,655 వసూళ్లు సాధించింది.

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో
ఇక హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సరిలేరు నీకెవ్వరు కలెక్షన్ల ప్రభంజనం కొనసాగింది. ఏడో రోజున ఈ చిత్రం రూ.1 కోటి గ్రాస్‌ను సొంతం చేసుకొన్నది. క్రాస్ రోడ్డులో ఇలా కోటి రూపాయల కలెక్షన్లను సాధించడం 49వ సారి కాగా, మహేష్ చిత్రాల పరంగా ఇది తొమ్మిదోసారి. మహేష్‌బాబు 9 సార్లు, ప్రభాస్, చిరంజీవి 5 సార్లు,పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ 4 సార్లు ఈ రికార్డును సొంతం చేసుకొన్నారు.