9 days box office collections: సరిలేరు నీకెవ్వరు కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉన్నాయంటే..
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు వసూళ్ల పరంపరను రెండోవారంలో కూడా కొనసాగిస్తున్నది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రదేశాల్లో నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిందనే వార్తలు అందుతున్నాయి. ఇక సంక్రాంతి బరిలో వచ్చిన అల వైకుంఠపురంతో కలిసి పోటాపోటీగా వసూళ్లను సాధించడం గమనార్హం. గత 9 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

9వ రోజున కలెక్షన్లు
ఇక 9వ రోజున ఏపీ, తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజాంలో రూ.2.35 కోట్లు
సీడెడ్‌లో రూ. 85 లక్షలు
ఉత్తరాంధ్రలో రూ.1.14 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ. 71 లక్షలు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 33 లక్షలు
గుంటూరులో రూ. 37 లక్షలు
కృష్ణా జిల్లాలో రూ.44 లక్షలు
నెల్లూరులో రూ.19 లక్షలు వసూలు చేసింది.

మొత్తం 9 రోజుల్లో
ఏపీ, తెలంగాణలో మొత్తం 9 రోజుల్లో
గత 9 రోజుల్లో సరిలేరు నీకెవ్వరు సాధించిన మొత్తం
నైజాంలో రూ.32 కోట్లు
సీడెడ్‌లో రూ.14 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.16 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.10 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6 కోట్లు
గుంటూరులో రూ.9 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.7.5 కోట్లు
నెల్లూరులో రూ.3.5 కోట్లు వసూలు చేశాయి.

ప్రపంచవ్యాప్తంగా రూ. 117 కోట్ల షేర్
సరిలేరు నీకెవ్వరు చిత్రం 9వ రోజున భారీ వసూళ్లు సాధించడంతో రికార్డు వసూళ్లు నమోదయ్యాయి. ఆదివారం రోజున ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో రూ.6.5 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా రూ.7 కోట్ల షేర్‌ను నమోదు చేసుకొన్నది. దీంతో ఈ చిత్రం 9 రోజుల్లో మొత్తంగా ఏపీ తెలంగాణలో రూ.98 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా రూ.117 కోట్ల షేర్‌ను రాబట్టింది.

ఓవర్సీస్‌లో వసూళ్లు
ఇక ఏపీ, తెలంగాణేతర రాష్ట్రాల్లో కూడా సరిలేరు నీకెవ్వరు సత్తా చాటుతున్నది. కర్ణాటకలో రూ.6.8 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.2 కోట్లు, ఓవర్సీస్‌లో 10.5 కోట్లు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా 117 కోట్ల షేర్, 187 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టడం ఓ రికార్డుగా ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

సరిలేరు నీకెవ్వరు ప్రి రిలీజ్ బిజినెస్
సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి..
నైజాంలో రూ.25 కోట్లు
సీడెడ్‌లో రూ.11 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.10 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ. 7 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6 కోట్లు
గుంటూరులో రూ.7 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.6 కోట్లు
నెల్లూరులో రూ.3 కోట్లు
కర్ణాటకలో రూ.8 కోట్లు
మిగితా రాష్ట్రాల్లో రూ.2 కోట్లు
ఓవర్సీస్‌లో రూ.14 కోట్లుతో మొత్తంగా రూ.99 కోట్లకుపైగా బిజినెస్ నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ హిట్ కావడానికి కావాల్సిన రూ.100 కోట్లను కలెక్షన్లు సులభంగా దాటడంతో డిస్టిబ్యూటర్లలో ఆనందం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











