ప్రీమియర్స్‌తోనే ఆ ఫీట్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా సూపర్ స్టార్ రేంజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే. వరుసగా బాక్సాఫీస్‌పై దాడి చేస్తున్న మహేష్ బాబు.. రికార్డులను తరిమి తరిమి కొడుతున్నాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి చిత్రాలతో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న మహేష్ బాబు.. ఓవర్సీస్‌లోనూ మార్కెట్ పెంచుకున్నాడు. ఓవర్సీస్‌లో అత్యధిక మార్కెట్ ఉన్న అతికొద్ది మంది హీరోల్లో మహేష్ ఒకడు.

వన్ మిలియన్ మార్క్..
ఓవర్సీస్‌లో వన్ మిలియన్ డాలర్స్ మార్క్‌ను క్రాస్ చేయాలని ఎంతో మంది హీరోలు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే అది ఎంతో మందికి అందని ద్రాక్షగానే ఉంటోంది. మాస్ మంత్రం జపించే ఇక్కడి హీరోలు.. అక్కడి ప్రేక్షకుల మనసు దోచుకోలేకపోతున్నారు.

ప్రీమియర్స్‌తోనే ఆ ఫీట్..
అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, చిరంజీవి, మహేష్ బాబు లాంటి హీరోలు వన్ మిలియన్ మార్క్ ఎప్పుడో క్రాస్ చేసేశారు. వీరిలో చాలా మంది కేవలం ప్రీమియర్స్‌తోనే వన్ మిలియన్ మార్క్ ఫీట్‌ను టచ్ చేశారు.

వరుసగా ఏడో సారి..
కేవలం ప్రీమియర్స్‌తోనే హాఫ్ మిలియన్ మార్క్‌ను అవలీలగా దాటేయగల సత్తా ఉన్న హీరో మహేష్ బాబు. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. ప్రీమియర్స్‌తోనే హాఫ్ మిలియన్ ఫీట్‌ను వరుసగా ఏడోసారి అందుకున్న సూపర్ స్టార్..నిజంగానే సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్నాడు.

విడుదలకు అంతా సిద్దం..
అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ టేకింగ్, మహేష్ మ్యానరిజం, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, విజయశాంతి, ప్రకాశ్ రాజ్, బండ్ల గణేష్, సంగీత, రష్మిక మందాన్న, రాజేంద్ర ప్రసాద్ లాంటి భారీ తారాగణంతో ఎన్నో అంచనాల నడుమ రాబోతోన్న సరిలేరు నీకెవ్వరు రేపు విడుదలయ్యేందుకు అంతా సిద్దమైంది.


Click it and Unblock the Notifications











