భారీ అంచనాలతో సరిలేరు.. ఫస్ట్ డే మహేష్ ఎంత కొల్లగొడతాడంటే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంపై ఎంతటి అంచనాలు ఏర్పడ్డాయో అందరికీ తెలిసిందే. అనిల్ రావిపూడి ఎఫ్2 లాంటి బ్లాక్ బస్టర్‌తో హిట్ కొట్టగా మహేష్ బాబును సరిలేరు నీకెవ్వరులా చూపించేందుకు వచ్చాడు. గతేడాది సంక్రాంతికి ఎఫ్2తో వచ్చిన అనిల్ రావిపూడి.. ఈసారి సరిలేరు అంటూ వచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ డే కలెక్షన్లు అంటూ ఫ్యాన్స్ హల్ చల్ చేస్తున్నారు.

మారిన ట్రెండ్..
ఒకప్పుడు వంద రోజులు, రెండు వందల రోజులు, ఏడాది ఇలా సినిమాలు ఆడుతుండటం విశేషం. తమ హీరోల సినిమాలు ఇన్ని సెంటర్లలో ఎన్ని రోజులు ఆడాయో అన్నది రికార్డులుగా చెప్పుకునే వారు. అయితే అదంతా ఒకప్పుడు. మారిన ట్రెండ్ ప్రకారం ఈ కాలంలో ఓ సినిమా రెండు మూడు వారాలు ఆడటమే కష్టంగా మారింది.

ఇప్పుడంతా కలెక్షన్ల హోరు..
ఒకప్పుడు వంద రోజులు అడితే రికార్డ్.. ఇప్పుడు వంద కోట్టు కొల్లగొడితే రికార్డ్. అలా రోజుల నుంచి వసూళ్లకు మారింది. మా హీరో సినిమా ఇంత కలెక్ట్ చేసిందంటే.. మా హీరో సినిమా అంత కలెక్ట్ చేసిందని ఫ్యాన్స్ వార్ జరగుతుండటం అందరికీ తెలిసిందే. కలెక్షన్స్‌లో కూడా రకరకాల పేర్లు పెట్టి రికార్డులు క్రియేట్ చేస్తుంటారు. అందులో ఫస్ట్ డే కలెక్షన్స్, అత్యంత వేగంగా వంద కోట్ల క్లబ్‌లో చేరడం, వీకెండ్ కలెక్షన్స్ ఇలా కొత్త కొత్త లెక్కలు కడుతుంటారు.

ఫస్ట్ డే కలెక్షన్లపై కన్ను...
దాదాపు స్టార్ హీరోలందరి ఫస్ట్ డే కలెక్షన్లపై గురి పెడుతుంటారు. ఈ క్రమంలోనే భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. భారీ మొత్తంలో కొల్లగొట్టేందుకు సింగిల్‌గా బరిలోకి దిగేందుకు ఇష్టపడుతారు. ఈ క్రమంలోనే సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో వేర్వేరుగా రిలీజ్ చేసేందుకు ఇరు నిర్మాతలు ఒప్పుకున్నారు.

భారీ మొత్తంలో కొల్లగొట్టనున్న మహేష్..
దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని 80శాతం థియేటర్లలో సరిలేరు పడబోతోంది. వీటికి తోడు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అదనపు షోలకు అనుమతినిచ్చాయి. ఇక ఫస్ట్ డే కలెక్షన్లో కొత్త రికార్డులను క్రియేట్ చేసే చాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయి. మొదటి రోజు సరిలేరు ఎంత రాబట్టనున్నాడో ఏరియాల వారిగా ఓ సారి చూద్దాం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగానే..
రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు సరిలేరు మేనియాను నడవబోతోన్న కారణంగా పెద్ద మొత్తంలో షేర్‌ను సాధించేట్టు కనిపిస్తోంది. మహేష్‌కు భారీ ఫాలోయింగ్ ఉన్న నైజాం ఏరియాలో పది కోట్లు, సీడెడ్‌లో 4.5కోట్లు, ఉత్తరాంద్రలో 4కోట్లు, ఈస్ట్‌లో 4 కోట్లు, వెస్ట్‌లో 4కోట్లు, గుంటూరు 5కోట్లు, కృష్టా 2.25కోట్లు, నెల్లూరు 1.75కోట్లు కొల్లగొట్టబోతోందని తెలుస్తోంది.
Recommended Video

ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియాలో..
ఇలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 35కోట్లు వసూళ్లు చేయనుండగా.. కర్ణాటక, తమిళ, కేరళ ఇలా అన్నింటిని కలుపుకుంటే.. దాదాపు 5కోట్లు కాగా, ఓవర్సీస్‌లో దాదాపు ఆరు కోట్లు వసూళ్ల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ లెక్కన మొత్తంగా 47కోట్ల షేర్, 68కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేస్తుందని టాక్.


Click it and Unblock the Notifications











