శివరాత్రి స్పెషల్ షోలు.. ఒక్క షో తోనే అదరగొట్టిన మహేష్ మూవీ.. ఇస్మార్ట్ శంకర్ కూడా..
గురువారం గాలి సంపత్, శ్రీకారం, జాతి రత్నాలు వంటి డిఫరెంట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. అయితే ఈ సినిమాలతో పాటు శివరాత్రి సందర్భంగా మరికొన్ని సినిమాల స్పెషల్ షోలు వేశారు. ప్రతి శివరాత్రికి పాత సినిమాలు హడావుడి చేయడం గురించి అందరికి తెలిసిందే. ఇక ఈ సారి వచ్చిన రీసెంట్ మూవీస్ కలెక్షన్స్ బాగానే అందుకున్నాయి. ఒకసారి ఆ సినిమాల కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

మహేష్ బాబు.. సరిలేరు నీకెవ్వరు
మహా శివరాత్రి సందర్భంగా ప్రతి ఏడాది స్పెషల్ గా రెండు నైట్ షోలు వేయడం గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ సారి స్టార్ హీరోల హిట్టు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే అందుకున్నాయి. ఇక అందులో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ఒక్క షోతోనే అన్ని సినిమాల కంటే ఎక్కువగా రాబట్టింది.

ఇండస్ట్రీ హిట్స్ మరోసారి
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లలో ఉదయం మొత్తం కొత్త సినిమాలు హడావుడి చేసిన అనంతరం రాత్రి జాగరణలో స్టార్ హీరోల గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకున్నాయి. రంగస్థలం, సరైనోడు, ఇస్మార్ట్ శంకర్, శ్రీమంతుడు వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు రెండు షోలతోనే లక్షల్లో షేర్స్ అంధించాయి.

ట్రెండ్ అవుతున్న మహేష్ మూవీ
సరిలేరు నీకెవ్వరు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఒక షో మాత్రమే పడింది. అయినప్పటికీ అన్ని సినిమాలకంటే ఎక్కువగా 1.47లక్షల వసూళ్లను అందుకోవడం విశేషం. దీంతో ఒక్కసారిగా
అభిమానులు సినిమా ట్యాగ్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

స్టామినా ఏమిటో చూపించారు
ఇక సరైనోడు సినిమా రెండు స్పెషలు షోలు వేయగా ఆ సినిమా 1.39లక్షలను అందుకుంది. రంగస్థలం కూడా రెండు షోలతో 1.4లక్షలను అందుకుంది. ఇస్మార్ట్ శంకర్ 1.21కూడా అదే తరహాలో అందుకోగా.. శ్రీమంతుడు కూడా 1.13లక్షలను రాబట్టింది. మొత్తానికి స్టార్ హీరోల సినిమాలు అయితే మరోసారి వారి స్టామినా ఏమిటో చూపించారు. పలు ఏరియాల్లో అల.. వైకుంఠపురములో కూడా మంచి వసూళ్లను రాబట్టింది.


Click it and Unblock the Notifications











