Saripodhaa Sanivaaram 8 days Collections: 2 వారంలో సరిపోదాకు భారీగా కలెక్షన్లు.. నాని మూవీకి ఎన్ని కోట్లంటే?

నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం రెండో వారంలోకి ప్రవేశించింది. తొలి రోజు నాని కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం తుఫాన్, వరద పరిస్థితులను ఎదురించి భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్న కారణంగా బాక్సాఫీస్ వద్ద జోష్ తగ్గినప్పటికీ.. ఈ చిత్రం స్టడీగా నంబర్లు సాధిస్తున్నది. ఈ సినిమా 8వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, మురళీ శర్మ తదితరులు నటించారు. ఈ సినిమాను సుమారుగా 100 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ సినిమా 42 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా 45 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

Saripodhaa Sanivaaram 8 days Box Office Collections Worldwide Nani Movie is study at GBOC

ఇక సరిపోదా శనివారం సినిమా తొలివారం రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. తొలివారం ఈ సినిమా విడుదలైన ప్రతీ చోట అత్యధిక వసూళ్లను నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 37 కోట్ల నికర వసూళ్లు, కన్నడలో 6 కోట్లు, తమిళంలో 4 కోట్లు, కేరళలో 50 లక్షలు, హిందీ, ఇతర ప్రాంతాల్లో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం సుమారుగా 50 కోట్ల నికర కలెక్షన్లు రాబట్టింది.

ఇక ఈ చిత్రం ఎనిమిదో రోజున కూడా నిలకడగా వసూళ్లును నమోదు చేసింది. ఈ మూవీ తెలుగులో 1.5 కోట్ల రూపాయలు, తమిళంలో 20 లక్షలు, కన్నడలో 40 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 2 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 52 కోట్ల నికరంగా వసూలు చేసింది.

Saripodhaa Sanivaaram 8 days Box Office Collections Worldwide Nani Movie is study at GBOC

ఇదిలా ఉండగా, ఓవర్సీస్‌లో నాని మూవీ అత్యధిక వసూల్లను రాబట్టింది. ఈ చిత్రం ఇప్పటి వరకు 3 మిలియన్ డాలర్లు అంటే..25 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. నార్త్ అమెరికాలోనే 2.2 మిలియన్ డాలర్లు రాబట్టడం విశేషంగా మారింది. ఇంకా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వేరే సినిమాల పోటీని తట్టుకొని భారీ వసూళ్లు రాబడుతున్నది.

సరిపోదా శనివారం మూవీ గత వారం రోజులుగా బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు రాబట్టడంతో ఈ సినిమా 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరేందుకు రెడీ అవుతున్నది. ఇప్పటికీ ఈ సినిమా 80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి చేరుకొన్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X