Saripodhaa Closing Collections: 100 కోట్ల టార్గెట్.. నాని మూవీకి లాభమా? నష్టమా?

నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం అంచనాలకు మించి కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం గత మూడు వారాలుగా వసూళ్లను నిలకడగా వసూలు చేసింది. దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మూడోవారంలో అతి తక్కువగా కలెక్షన్లను రాబట్టడంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిందనే విషయం స్పష్టమైంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి 3 వారాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

క్రైమ్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ అంశాలతో రూపొందిన ఈ సినిమాలో తమిళ దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య, మురళీ శర్మ, ప్రియాంక అరుళ్ మోహన్, అజయ్ ఘోష్, సాయికుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని సుమారుగా 80 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రమోషన్స్‌, ఇతర ఖర్చులతో కలిపి ఈ సినిమా 100 కోట్ల మేర నిర్మాణ వ్యయం అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Saripodhaa Sanivaaram Box Office Closing Collections Was Nani Movie breach Break Even Target

నాని మూవీపై అంచనాలు భారీగా ఉండటంతో ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ 30 కోట్ల రూపాయలకు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల హక్కులు 6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 5 కోట్లకు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా 41 కోట్ల మేర కలెక్షన్లు వసూలు అయ్యాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీని వరల్డ్ వైడ్ సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ప్రియాంక అరుళ్ మోహన్ నటించిన ఈ సినిమా 45 కోట్ల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. తొలి వారం ఈ చిత్రం 53 కోట్లకుపైగా నికర వసూళ్లను రాబట్టింది. తెలుగులో 40 కోట్ల రూపాయలు, తమిళంలో 3 కోట్లు, కన్నడలో 8 కోట్ల రూపాయలు, మలయాళంలో 1 కోటి రూపాయలు, హిందీలో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తొలి వారం 53 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Saripodhaa Sanivaaram Box Office Closing Collections Was Nani Movie breach Break Even Target

ఇక రెండోవారంలో ఈ చిత్రం తెలుగులో 13 కోట్లు, కన్నడలో 1.5 కోట్లు, తమిళంలో 60 లక్షలు, మలయాళంలో 40 లక్షలు, హిందీ, ఇతర భాషల్లో 35 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 15 కోట్ల రూపాయలు నమోదు చేసింది. దాంతో రెండు వారాల్లో ఈ సినిమా 68 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక మూడో వారంలో సరిపోదా చిత్రం ఓ మోస్తారు కలెక్షన్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రూపాయలు, కన్నడలో 50 లక్షలు, తమిళంలో 25 లక్షలు, హిందీ, ఇతర ప్రాంతాల్లో 25 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 6 కోట్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా 74 కోట్లు వసూలు చేసింది.

నాని మూవీకి ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా నార్త్ అమెరికా అంటే.. కెనడా, అమెరికాతోపాటు యూకే, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో కలిపి ఈ చిత్రం 30 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా అరుదైన మైలురాయిని దాటిందని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి.

Saripodhaa Sanivaaram Box Office Closing Collections Was Nani Movie breach Break Even Target

ఇక ఈ చిత్రం 45 కోట్ల షేర్ టార్గెట్‌గా రూపొందిన ఈ సినిమా దాదాపు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అధిగమించింది. తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో భారీ లాభాలు సాధించగా.. ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌కు చేరువగా వచ్చింది. కేరళ, తమిళనాడు, హిందీలో నష్టాల్లో ముగిసింది. టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. లాభాలే తెచ్చి పెట్టిందనే విషయం ట్రేడ్ వర్గాలు స్పస్టం చేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X