Saripodhaa Box Office: 100 కోట్ల టార్గెట్‌తో సరిపోదా శనివారం.. నాని కెరీర్‌లో హయ్యెస్ట్‌గా.. ఎన్ని కోట్లంటే?

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వచ్చిన సరిపోదా శనివారం చిత్రం భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. RRR లాంటి గొప్ప సినిమాను అందించిన ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌‌మెంట్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. ఆగస్టు 29వ తేదీన రిలీజైన ఈ చిత్రం తొలి రోజు ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసింది? బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

తమిళ దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య, మురళీ శర్మ, ప్రియాంక అరుళ్ మోహన్, అజయ్ ఘోష్, సాయికుమార్ తదితరులు నటించిన ఈ సినిమాను సుమారుగా 80 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రమోషన్స్‌, ఇతర ఖర్చులతో కలిపి ఈ సినిమా 100 కోట్ల మేర నిర్మాణ వ్యయం అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Saripodhaa Sanivaaram Box Office Collections Here day wise and Telugu States Tamil Kannada Overseas Collections

ఇక సరిపోదా శనివారం సినిమా ప్రీ రిలీజ్ భారీగానే జరిగింది. నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ వ్యాపారం జరిగింది. ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ 30 కోట్ల రూపాయలకు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల హక్కులు 6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 5 కోట్లకు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా 41 కోట్ల మేర కలెక్షన్లు వసూలు అయ్యాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్స్‌కు భారీ రెస్పాన్స్ రావడంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ మూవీని వరల్డ్ వైడ్ సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి తొలి రోజు 55 నుంచి 65 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. పాజిటివ్ రావడంతో సాయంత్రం తర్వాత ఆక్యుపెన్సీ పెరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Saripodhaa Sanivaaram Box Office Collections Here day wise and Telugu States Tamil Kannada Overseas Collections

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం అన్నిచోట్ల పాజిటివ్ టాక్‌తో భారీ ఒపెనింగ్స్ సాధించింది. తమిళంలో ఈ చిత్రం తొలి రోజున 50 లక్షల గ్రాస్ వసూళ్లను, కన్నడలో 1 కోటి రూయాల గ్రాస్ వసూళ్లు, కేరళ, హిందీ భాషల్లో కలిపి సుమారుగా 75 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని తెలిపారు. దాంతో ఇండియా వైడ్ ఈ చిత్రం 9 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది.

ఇక ఓవర్సీస్‌లో సరిపోదా శనివారం సినిమా ఓవర్సీస్‌లో ప్రీమియర్ షో, తొలి రోజు కలెక్షన్ల భారీగానే నమోదు అయ్యాయి. నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రం ప్రీమియర్ల ద్వారా 550K డాలర్లు వసూలు చేసింది. ఇక తొలి రోజు చివరి సమాచారం అందే సరికి 750K డాలర్లు వసూలు చేసింది. ప్రీమియర్, తొలి రోజు కలెక్షన్లు సుమారుగా 1 మిలియన్ డాలర్లు వరకు కలెక్ట్ చేయవచ్చని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Saripodhaa Sanivaaram Box Office Collections Here day wise and Telugu States Tamil Kannada Overseas Collections

అయితే సరిపోదా శనివారం సినిమా ఏపీ, తెలంగాణలో తొలి రోజు 14 కోట్ల గ్రాస్, ఇతర రాష్ట్రాల్లో 2.25 కోట్ల గ్రాస్ కలిపి ఈ చిత్రం 16.25 కోట్లు ఇండియాలో కలెక్ట్ చేసింది. ఓవర్సీస్‌లో 6.3 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం తొలి రోజున సుమారుగా 23 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసిందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X