తుఫాన్‌ను ఎదురించి సరిపోదా శనివారం కలెక్షన్లు సునామీ.. నాని మూవీకి 4వ రోజు ఎన్ని కోట్లంటే?
తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ పరిస్థితులను ఎదురిస్తూ సరిపోదా శనివారం చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం నాని కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఘనతను సాధించేందుకు పరుగులు పెడుతున్నది. ఈ 4వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తమిళ స్టార్ యాక్టర్ ఎస్‌జే సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, మురళీ శర్మ లాంటి నటులతో రూపొందిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందించారు. జేక్ బిజోయ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇతర సాంకేతిక నిపుణలు, ప్రమోషనల్ ఖర్చులతో ఈ చిత్రం సుమారుగా 100 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌తో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకోవడంతో రికార్డు వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ చిత్రం తొలి రోజున 9 కోట్ల రూపాయలు, రెండో రోజున 6 కోట్ల రూపాయలు, 3 రోజున 9.2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో 3 రోజుల్లో ఈ చిత్రం 24.2 కోట్ల రూపాయలు ఇండియాలో వసూలు చేసింది.
ఇక తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సరిపోదా శనివారం సినిమా వసూళ్ల వివరాల్లోకి వెళితే.. తెలుగులో 8.75 కోట్లు, రెండో రోజు 8.5 కోట్లు, 3వ రోజు 8.6 కోట్లు వసూలు చేసింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో 25.75 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. మలయాళం, తమిళ, కన్నడ, హిందీలో కలిపి మొత్తంగా 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఆంద్రా, నైజాంలో తుఫాన్ భీభత్సాన్ని ఎదురించి సరిపోదా శనివారం చిత్రం కలెక్షన్లను సాధించింది. గత మూడు రోజుల కంటే అధికంగా వసూళ్లను సాధించడం రికార్డుగా మారింది. ఈ చిత్రం 4వ రోజున దక్షిణాదిలో భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగులో 9 కోట్ల రూపాయలు, తమిళంలో 1 కోటి రూపాయలు, కేరళలో 40 లక్షలు, కన్నడలో 1.5 కోట్లు, హిందీలో 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో 11 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
అలాగే ఓవర్సీస్‌లో కూడా నాని సినిమా అద్బుతమైన కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం 4వ రోజున 416 లొకేషన్లలో 300K డాలర్లను వసూలు చేసింది. దాంతో గత నాలుగు రోజుల్లో ఈ సినిమా 1.9 మిలియన్ డాలర్లను రాబట్టింది. భారతీయ కరెన్సీలో దాదాపు 16 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది. ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి భారీ లాభాల్లోకి ప్రవేశించింది.


Click it and Unblock the Notifications











