Saripodhaa Total Collections: సరిపోదా శనివారం టోటల్ కలెక్షన్లు.. నానికి ఎంత లాభం? ఎంత నష్టం?
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం సరిపోదా శనివారం. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? థియేట్రికల్ రన్‌లో ఎంత వసూలు చేసింది? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఎన్ని కోట్ల రూపాయల లాభం వచ్చిందనే వివరాల్లోకి వెళితే..
ప్రియాంక అరుల్ మోహన్, ఎస్‌జే సూర్య, మురళీ శర్మ, సాయి కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తన సొంత బ్యానర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై సుమారుగా 100 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా దాదాపు 50 కోట్ల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్ల ట్రార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. నాని నటించిన గత చిత్రం మంచి సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమా ముందస్తు వ్యాపారం సాఫీగా సాగిపోయింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు భారీ ధర పలికింది. ఈ మూవీ ఆంధ్రా, నైజాం హక్కులు 30 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల హక్కులు 6 కోట్లు, ఓవర్సీస్ హక్కులు 5 కోట్ల రూపాయలు మేర జరిగింది. దాంతో ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 41 కోట్ల మేర జరిగింది.
సరిపోదా శనివారం సినిమా టోటల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 30 కోట్ల రూపాయల గ్రాస్, ఏపీలో 26 కోట్ల కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 9.5 కోట్లు, తమిళనాడు హక్కులు 6 కోట్ల రూపాయలు, కేరళ హక్కులు 50 లక్షలు, ఇతర రాస్ట్రాల్లో 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.
ఇక సరిపోదా శనివారం సినిమా ఓవర్సీస్‌లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నార్త్ అమెరికా అంటే కెనడా, అమెరికాలో భారీ కలెక్షన్లు నమోదు అయ్యాయి. థియేట్రికల్ రన్‌లో అన్ని దేశాల్లో కలిపి ఈ చిత్రం 27 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. విదేశాల్లో ఈ సినిమా భారీ లాభాలను సాధించింది.

ఇక వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ అన్ని రకాల ప్రతికూలతను ఎదుర్కొని రికార్డు వసూళ్లు నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్ల గ్రాస్, 52 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. ఈ మూవీ థియేట్రికల్‌గా సుమారుగా 7 కోట్ల రూపాయల లాభాన్ని రాబట్టింది. నిర్మాత దానయ్యకు థియేట్రికల్, డిజిటల్, ఆడియో అన్నీ కలిపి రికార్డు లాభాలను వచ్చాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
#SaripodhaaSanivaaram + #SuryasSaturday Area Wise Total Gross
👉Nizam - 30CR (Tracked)
👉AP - 26CR (Tracked)
👉Karnataka - 9.5CR
👉Tamilnadu - 6CR
👉Kerala - 0.5CR (Tracked)
👉ROI - 2CR (Tracked)
👉Overseas - 26.4CR
Worldwide Gross - 100.4CR
Worldwide Share ≈ 52CR
Verdict - Super Hit 👌🏻
3rd 100CR Grosser and 3rd 50CR share film for #Nani


Click it and Unblock the Notifications











